జగన్‌తో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు : డీకే అరుణ

జగన్‌తో కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు : డీకే అరుణ

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శలు గుప్పించారు. అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో పోతిరెడ్డిపాడు సమస్యను పరిష్కరిస్తారని అనుకుంటే... సమస్యపై మాట్లాడకుండా మహబూబ్‌నగర్‌లో ప్రాజెక్టు కడతా అంటున్నారని డీకే అరుణ విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. ప్రజల అమాయకత్వం అలుసుగా మాయ మాటలు చెబుతున్నారు డీకే అరుణ. పోతిరెడ్డిపాడు-సంగమేశ్వర ప్రాజెక్టులపై ఏపీ సీఎం జగన్‌తో.... కేసీఆర్‌ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారని... డీపీఆర్‌లు రహస్యం కానప్పుడు ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటా 535 టీఎంసీలు కాగా 299 టీఎంసీలకు కేసీఆర్‌ ఒప్పుకున్నారని డీకే అరుణ మండిపడ్డారు.

Tags

Read MoreRead Less
Next Story