మాట నిలబెట్టుకోని టీఆర్‌ఎస్ కు ఓటు వేయవద్దు - కిషన్ రెడ్డి

X
kasi24 Nov 2020 11:59 AM GMT
టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని అలాంటి పార్టీకి ఓటు వేయవద్దన్నారు.. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి. మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని పలు డివిజన్లలో రోడ్‌షో నిర్వహించిన కిషన్ రెడ్డి... కార్పొరేషన్‌కు సంబంధించిన ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు. వరద బాధితులు కష్టాల్లో ఉన్నా నాయకులు పట్టించుకోలేదని... దుబ్బాక ప్రజలు TRS కు ఏ విధంగా బుద్ధి చెప్పారో అదే విధంగా GHMC ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి అధికార పార్టీకి బుద్ధి చెప్పాలని కిషన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
Next Story