తెలంగాణ

హీట్‌ పెంచుతోన్న దుబ్బాక ఉప ఎన్నిక

హీట్‌ పెంచుతోన్న దుబ్బాక ఉప ఎన్నిక
X

దుబ్బాక ఉప ఎన్నిక హీట్‌ పెంచుతోంది. ప్రధాన అభ్యర్థులంతా ఇప్పటికే నామినేషన్‌ వేయడంతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేస్తూనే.. తమను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని హామీలు ఇస్తున్నారు. మరోవైపు ఇతర పార్టీల నుంచి వలసలు కూడా ఊపందుకున్నాయి. సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్ నివాసంలో రాష్ట్ర బీజేపీ దళిత మోర్చ కౌన్సిల్‌ మెంబర్‌ తో పాటు 150 మంది బీజేపీ కార్యకర్తలు గులాబీ కండువా కప్పుకున్నారు.

దుబ్బాకకు సీఎం కేసీర్‌ సముద్రమంత సాయం చేస్తే.. బీజేపీ కాకిరెట్టంత సాయం చేసిందన్నారు హరీష్‌ రావు. సోషల్‌ మీడియాలో బీజేపీ చేసే గోబెల్స్ ప్రచారానికి, నోబెల్‌ బహుమతి ఇవ్వాలి అన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి దుబ్బాకు వస్తే వాళ్ల మైకులే మూగబోయాయి అంటూ ఎద్దేవ చేశారు. పరాయి లీడర్లు.. పరాయి కార్యకర్తలతో కాంగ్రెస్‌ మీటింగ్‌లు నడుస్తున్నాయి.. ప్రజలు అసలే లేరన్నారు.

మరోవైపు దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌ రావు నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా దుబ్బాక మారెమ్మ దేవాలయం నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు అయిదు వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు బీజేపీ తెలంగాణ సారథి బండి సంజయ్. దుబ్బాకను నిర్లక్ష్యం చేస్తూ సీఎం, కొడుకు, అల్లుడు దోపిడి చేస్తున్నారంటూ మండిపడ్డారు. దమ్ముంటే సీఎం దుబ్బాక వచ్చి తాము చెప్పింది అబద్ధాలు అని నిరూపించలని సవాల్ విసిరారు. దుబ్బాకలో ఎన్ని ఆటంకాలు వేసిన రఘునందన్ గెలుపు ఖాయమన్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థిగా చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి మొదటి సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అంతకుముందు దుబ్బాక మారెమ్మ గుడి నుంచి కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది.. తరువాత తెలంగాణ సర్కిల్ దగ్గర సభ నిర్వహించారు. సభకు హాజరైన పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబూ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. తెలంగాణను, దుబ్బాకను దారుణంగా వంచించిన ముఖ్యమంత్రి కేసీఆర్, టిఆర్ఎస్‌కు బుద్ధి చెప్పేందుకు ఈ ఉప ఎన్నిక అందివచ్చిన అవకాశంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

Next Story

RELATED STORIES