బ్రేకింగ్.. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

బ్రేకింగ్.. తెలంగాణలో దుబ్బాక ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల
X

మెద‌క్ జిల్లాలోని దుబ్బాక ఉప ఎన్నికకు షెడ్యూల్‌ను ఈసీ విడుదల చేసింది.. న‌వంబ‌ర్ 3న దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గానికి పోలింగ్ నిర్వహించ‌నున్నట్టు ప్రకటించింది. అలాగే 10వ తేదీన కౌంటింగ్ జ‌ర‌గ‌నుంది. అక్టోబ‌ర్ 9న నోటిఫికేష‌న్ విడుద‌ల కానుంది. నామినేష‌న్ల దాఖలుకు చివ‌రితేదీ అక్టోబ‌ర్ 16 కాగా.. నామినేష‌న్ల‌ను 17న ప‌రిశీలించనున్నారు. నామినేష‌న్ల ఉప‌సంహ‌ర‌ణ‌కు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 19 వరకు ఉంది.

టీఆర్ఎస్ ఎమ్మెల్యే సోలిపేట రామ‌లింగారెడ్డి అకాల మ‌ర‌ణంతో దుబ్బాక ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఎన్నిక‌ల షెడ్యూల్‌ను ప్రక‌టించ‌డంతో నేటి నుంచి దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గంలో ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లోకి రానుంది.

Tags

Next Story