దుబ్బాక టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. సోలిపేట సుజాత

దుబ్బాక  టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు.. సోలిపేట సుజాత
దుబ్బాక అసెంబ్లీ నియోజకర్గానికి జరిగే ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యారు..మాజీ ఎమ్మెల్యే, దివంగత సోలిపేట రామలింగారెడ్డి భార్య... సోలిపేట సుజాత పేరును..

దుబ్బాక అసెంబ్లీ నియోజకర్గానికి జరిగే ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారు అయ్యారు..మాజీ ఎమ్మెల్యే, దివంగత సోలిపేట రామలింగారెడ్డి భార్య... సోలిపేట సుజాత పేరును ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. రామలింగారెడ్డి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల పాత్ర పోషించారని... ఉద్యమం, పార్టీ కోసం అంకిత భావంతో పని చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి చివరి శ్వాస వరకు ఎంతో కష్టపడి పని చేశారని.... రామలింగారెడ్డి కుటుంబం యావత్తు అటు ఉద్యమంలోనూ ఇటు నియోజకవర్గ అభివృద్ధిలోనూ పాల్పంచుకుందని కొనియాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలతో ఆ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని చెప్పారు. రామలింగారెడ్డి తలపెట్టిన నియోజకవర్గ అభివృద్ధిని కొనసాగించడానికిప్రభుత్వ కార్యక్రమాలు యధావిధిగా అమలు కావడానికి రామలింగారెడ్డి కుటుంబ సభ్యులే ప్రాధినిద్యం వహించడం సమంజసం అని సీఎం అభిప్రాయపడ్డారు... జిల్లాలోని నాయకులందరితో సంప్రదింపులు జరిపాకే సుజాత అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశామని తెలిపారు.

ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే అంశంపై ఉత్కంఠ కొనసాగుతోంది... నర్సారెడ్డి పేరు దాదాపు ఖారారు చేసింది తెలంగాణ పీసీసీ. అయితే చివరి నిమిషంలో మార్పులు చేర్పులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డికి కాంగ్రెస్‌ ఆఫర్‌ ఇచ్చింది. టికెట్‌ ఇస్తాం... పోటీ చేయాలంటూ... శ్రీనివాస్‌రెడ్డితో మంతనాలు జరుపుతున్నారు కాంగ్రెస్‌ నేతలు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిగా సుజాత పేరు ఖరారు కావడంతో...చెరుకు శ్రీనివాస్‌రెడ్డి ఏం నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story