Editorial: "అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ రిపోర్ట్- ఆ నేతల్లో వణుకు..?"

Editorial: అధిష్టానానికి తెలంగాణ కాంగ్రెస్ కొత్త బాస్ రిపోర్ట్- ఆ నేతల్లో వణుకు..?
తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త టెన్షన్; ఢిల్లీ పెద్దలకు కొత్త ఇన్ ఛార్జ్ నివేదిక; పార్టీ పరిస్థితి, లీడర్ల పనితీరుపై రిపోర్ట్; కొందరు నేతల తీరుపై ఠాక్రే అసహనం; అధిష్టానం స్పందనపై తీవ్ర ఉత్కంఠ

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. యాత్ర ఫర్ చేంజ్ పేరుతో చేపట్టిన పాదయాత్ర జోరుగా సాగుతోంది. ఊహించిన దానికంటే ఎక్కువ జనం రేవంత్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. రేవంత్ యాత్ర సక్సెస్ అన్న టాక్ మొదలైంది. స్టేట్ ఇంటలిజెన్స్ వర్గాలు కూడా రేవంత్ చేపట్టిన పాదయాత్రపై ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి నివేదిక ఇస్తున్నారట. రేవంత్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి.. ప్రత్యర్థి వర్గాలు టెన్షన్ పడటం కామన్. అయితే సొంతపార్టీలో కూడా కొద్దిమంది నేతలకు సేమ్ గుబులు పట్టుకుందట. నిజానికి హత్ సే హత్ జోడో అభియన్ లో అందరు నేతలను పాదయాత్రలు చేయమని హైకమాండ్ చెప్పింది. కానీ చాలా మంది లీడర్లు లైట్ తీసుకున్నారు. రేవంత్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి తాము యాత్రలు చేయాలనీ మల్లగుల్లాలు పడుతున్నారట. ఇదిలా ఉంచితే రాష్ట్ర ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే రాష్ట్రంలో ఓవరాల్ పరిణామాలపై అధిష్టానికి ఓ నివేదిక ఇచ్చారట. దానిపైనే హస్తం పార్టీలో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.

ఈనెల 9న ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ కు ఇన్ ఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే నివేదిక ఇచ్చారట. దాదాపు గంటకుపైగా కేసీ వేణుగోపాల్ తో ఠాక్రే తెలంగాణలోని పార్టీ పరిస్థితులపై వివరించారట. దీంతో ఠాక్రే ఇచ్చిన నివేదికపై హస్తం నేతలు జోరుగా చర్చించుకుంటున్నారట. ఈ ఏడాదిలోనే రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి సమయంలో హస్తం నేతల పనితీరు, గ్రౌండ్ లెవల్ లో పార్టీ పరిస్థితి, హత్ సే హత్ జోడో అభియాన్, రాష్ట్ర రాజకీయాలపై ఠాక్రే తన రిపోర్ట్ లో వివరించినట్లు టాక్. ఇప్పటికే ఇన్ ఛార్జ్ ఠాక్రే నియోజకవర్గాల వారిగా నేతలతో దశలవారిగా చర్చించారు. సీనియర్, జూనియర్ నాయకులు, అనుబంధ సంఘాల లీడర్లతో మాట్లాడారు. అందరితో చర్చించిన ఠాక్రే.. పార్టీ పరిస్థితిపై పూర్తిస్థాయిలో అధిష్టానానికి రిపోర్ట్ సబ్మిట్ చేసినట్లు చర్చ నడుస్తోంది.

ఐతే అధిష్టానానికి ఠాక్రే ఇచ్చిన నివేదిక.. హస్తం పార్టీలో కొందరి నేతలను పరేషాన్ పెడ్తోందట. కొందరు నేతల పనితీరు పై ఠాక్రే అసహనంతో ఉన్నారట. పార్టీ బలోపేతం చేయడం పక్కన పెట్టి.. బలహీన పర్చేలా వ్యవహరిస్తున్నారని ఠాక్రే నివేదికలో పేర్కొన్నట్లు టాక్. ఇక హైదరాబాద్ లోనే ఉంటూ.. మానిటరింగ్ చేసే నాయకులు ఉన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్న పబ్లిక్ లోకి వెళ్లే ప్రయత్నం చేయడం లేదు. కానీ పార్టీలో అంతర్గత గొడవలకు కారణం అవుతున్నారని స్పష్టంగా ఠాక్రే తన రిపోర్ట్ లో చెప్పినట్లు చర్చ జరుగుతోంది.

ఇక ఏఐసీసీ పిలుపునిచ్చిన హత్ సే హత్ జోడో అభియాన్ ను సైతం పట్టించుకోని నేతలు కూడా ఉన్నారని ఠాక్రే తన రిపోర్ట్ లో చెప్పినట్లు టాక్. పీసీసీ చీఫ్ రేవంత్ తప్ప.. మిగతా నేతలు ఎవరు ప్రజల్లోకి వెళ్లడం లేదని, ఒకటిరెండు రోజులు కొందరు నేతలు యాత్రలు చేసి వదిలేసిన విషయం కూడా వివరించారట. ఇవేకాదు రాష్ట్ర అధికార పార్టీ బీఆర్ఎస్, బీజేపీల బలాబలాలపై కూడా ఠాక్రే తన నివేదికలో తెలిపారట. మొత్తానికి ఠాక్రే రిపోర్ట్ తో హస్తం నేతల్లో టెన్షన్ మొదలైంది. అధిష్టానం రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న బెంగ వెంటాడుతోంది.

Tags

Read MoreRead Less
Next Story