GHMC Mayor Council : రేపు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక..!

GHMC Mayor Council : రేపు జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక..!
మేయర్, డిప్యూటీ మేయర్ పదవులు ఎవరిని వరించనున్నాయో రేపు తెలుస్తుంది.

రేపు జీహెచ్ఎంసీ మేయర్ ఎవరో తేలిపోనుంది. రేపు ఉదయం 10గంటల 45నిమిషాలకు కొత్త సభ్యలు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అనంతరం మధ్యాహ్నం పన్నెండున్నర గంటలకు ఎక్స్అఫీషియో సభ్యులతో కలిసి 97 మంది సభ్యుల కోరంతో చేతులు ఎత్తే ప్రక్రియ ద్వారా మేయర్, డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. మొత్తం 150 స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 56 స్థానాలతో టీఆర్ఎస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీకి 47, ఎంఐఎంకు 44, కాంగ్రెస్‌కు రెండు డివిజన్లు దక్కాయి.

149 కొత్త కార్పొరేటర్లు కాకుండా ఎక్స్ అఫీషియో సభ్యులు 44 మందితో కలుపుకొని మొత్తం 193గా ఉంది. దీంతో మేజిక్ ఫిగర్ 97కి ఎవరు చేరుతారనేది ఉత్కంఠగా మారింది. టీఆర్ఎస్ పార్టీకి 13 మంది ఎమ్మెల్యేలు, 13 మంది ఎమ్మెల్సీలు, ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఎంఎఐంకు ఏడుగురు ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు, ఒక ఎంపీ ఉంటే.. అటు బీజేపీకి ఒక ఎమ్మెల్యేతో ఒక ఎంపీ ఉన్నారు.

గ్రేటర్ హైద‌రాబాద్ మేయ‌ర్ ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని బీజేపీ భావిస్తోంది. మేయ‌ర్ పీఠం త‌మ‌కు ద‌క్కక పోయినా ఏక‌గ్రీవంగా టీఆర్ఎస్ పార్టీకి ఆ స్థానం దక్కకూడదని భావిస్తోంది. మేయర్, డిప్యూటీ మేయర్ పదవులకు రేపు బీజేపీ నామినేషన్లు దాఖలు చేయనుంది. దీంతో ఫ్లోర్ టెస్టులో ఆ పార్టీ ఎలాంటి వ్యూహం అమ‌లు చేస్తుందన్నది ఆస‌క్తిక‌రంగా మారింది.

అటు టీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్అఫీషియో సభ్యులకు అధిష్టానం విప్ జారీ చేసింది. టీఆర్ఎస్ నుంచి మేయర్ ఎన్నిక పరిశీలకులుగా మంత్రులు కేటీఆర్, తలసాని, ఎంపీ కేకే.. డిప్యూటీ మేయర్ ఎన్నికకు విప్‌గా ఎమ్మెల్సీ ప్రభాకర్ ఉండనున్నారు. మరోవైపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ హాల్‌ను ఎస్ఈసీ పార్ధసారథి పరిశీలించారు.

Tags

Read MoreRead Less
Next Story