Top

ఈఎస్‌ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్‌

ESI స్కామ్‌లో మరోసారి మాజీ డైరెక్టర్ దేవికారాణిని అరెస్ట్ చేశారు. దేవికారాణితో పాటు మరో 8 మందిని..

ఈఎస్‌ఐ స్కాం: మరోసారి దేవికారాణి అరెస్ట్‌
X

ESI స్కామ్‌లో మరోసారి మాజీ డైరెక్టర్ దేవికారాణిని అరెస్ట్ చేశారు. దేవికారాణితో పాటు మరో 8 మందిని ఇవాళ ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సాయంత్రం వీరిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. నిన్న 6 కోట్ల 50 లక్షల రూపాయలకు సంబంధించి అక్రమాలు గుర్తించిన ACB అధికారులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా మరో కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టనున్నారు. కంచర్ల శ్రీహరి బాబూ అలియాస్ బాబ్జీ, కంచర్ల సుజాత, కుక్కల కృపా సాగర్‌రెడ్డి, బండి వెంకటేశ్వర్లు, చెరుకూరి నాగరాజు, వెంకటేష్‌లపై కేసు నమోదు చేశారు. మందుల కొనుగోళ్లలో అక్రమ లావాదేవీలతో ప్రభుత్వ ఖజానాకు పెద్ద మొత్తంలో నష్టం చేకూర్చిన నిందితులుగా వీరిని గుర్తించి ఏసీబీ కేసులు నమోదు చేసింది.

Next Story

RELATED STORIES