KTR: అప్పుల పేరుతో తప్పుడు లెక్కలు

KTR: అప్పుల పేరుతో తప్పుడు లెక్కలు
శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం అంకెల గారడీ.... స్వేదపత్రాన్ని విడుదల చేసిన కేటీఆర్‌

కేసీఆర్ ప్రభుత్వం హయాంలో 50 లక్షల కోట్ల సంపదతోపాటు.. తెలంగాణ అస్తిత్వాన్ని కూడా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సృష్టించిందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ శ్వేతపత్రాలకు కౌంటర్‌గా 'స్వేదపత్రం' విడుదల చేసిన ఆయన.. తెలంగాణను విఫల రాష్ట్రంగా చూపాలని ప్రయత్నిస్తున్నారని ఆక్షేపించారు. వడ్డించిన విస్తరిలా కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో అన్నీ పెట్టామని, ప్రభుత్వం ప్రకటించినట్లు ఎలాంటి విచారణలైనా చేయించుకోవచ్చని ఆయన అన్నారు. షాడో బృందాలు ఏర్పాటు చేసుకొని, రాష్ట్ర ప్రభుత్వ ప్రతి అడుగును నిశితంగా గమనిస్తామని కేటీఆర్ తెలిపారు.


ఆర్థిక, ఇంధన రంగాలపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్ గా భారత రాష్ట్ర సమితి స్వేదపత్రాన్ని విడుదల చేసింది. తెలంగాణ భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు KTR పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ పాలనను బద్నాం చేసే ప్రయత్నం చేసిందన్న ఆయన.. ప్రభుత్వం ఆరోపణలకు ధీటుగా సమాధానం చెప్పినట్లు పేర్కొన్నారు. కోట్ల మంది చెమటతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తీరును వివరించేందుకే స్వేదపత్రం విడుదల చేస్తున్నట్లు మాజీ మంత్రి KTR చెప్పుకొచ్చారు.


పౌర సరఫరాల సంస్థ నిల్వలను పక్కన పెట్టి లేని అప్పును ఉన్నట్లుగా చూపి సర్కార్‌ తిమ్మిని బమ్మిని చేస్తుందని KTR మండిపడ్డారు. కాంగ్రెస్‌ నేతలు బట్టకాల్చి మీద వేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ పాలనలో అంధకారమైన రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక వెలుగులోకి తీసుకొచ్చామని KTR పేర్కొన్నారు. రాష్ట్రాభివృద్ధిలో విద్యుత్‌ను భాగస్వామ్యం చేసిన ఘనత KCRకే దక్కుతుందని వివరించారు. భారతదేశంలో భూగర్భ జలాలు పెరగడానికి కారణం తెలంగాణేనని కేటీఆర్‌ తెలిపారు. ‘‘కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో చిన్న తప్పు ఉంటే మొత్తం ప్రాజెక్టే పనికిరాదన్నట్లు మాట్లాతున్నారని అన్నారు. తప్పు జరిగితే విచారణ జరిపి చర్య తీసుకోవాలి కానీ.. రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చవద్దంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు నేరవేర్చేలా.. ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వర్తిస్తామని KTR చెప్పారు. ‘‘ ప్రతి గెలుపు, ఓటమిలోనూ పాఠాలు ఉంటాయి... ఓటమి మాకు స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమే అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల సమష్టి సంపదను.. అస్థిత్వాన్ని కాపాడే ప్రయ గత పాలనలో జరిగిందన్న KTR.... దేశానికి తెలంగాణను ఎల్లప్పుడూ దిక్సూచిగా నిలపడానికి కృషి చేస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story