Ramayampet : రామాయంపేటలో తీవ్ర ఉద్రిక్తత.. మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లోకి మృతదేహాలతో..

Ramayampet : రామాయంపేటలో తీవ్ర ఉద్రిక్తత.. మున్సిపల్ ఛైర్మన్ ఇంట్లోకి మృతదేహాలతో..
Ramayampet : రియల్‌ ఎస్టేట్ వ్యాపారి సంతోష్‌, అతని తల్లి పద్మల మృతదేహాలను మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్ ఇంటిముందువేసి బంధువుల, స్థానికులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తంగా మారింది

Medak :మెదక్ జిల్లా రామాయంపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆత్మహత్యకు పాల్పడిన రియల్‌ ఎస్టేట్ వ్యాపారి సంతోష్‌, అతని తల్లి పద్మల మృతదేహాలను మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్ ఇంటిముందువేసి బంధువుల, స్థానికులు ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తంగా మారింది. అంతిమయాత్ర ప్రారంభం కాగానే వారి మృతదేహాలను మున్సిపల్ ఛైర్మన్ ఇంటివైపు మళ్లించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఊరుకోలేదు. వందలాదిమంది ఒక్కసారిగా మున్సిపల్ ఛైర్మన్ ఇంటిని ముట్టడించి .. డెడ్ బాడీలను వారి ఇంట్లోవేసి నిరసన తెలిపారు. వీరి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. అయితే మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్ .. ఇంటికి తాళం వేసి వెళ్లడంతో ఇంటిముందు డెడ్ బాడీ వేసి నిరనసకు దిగారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రికత్త నెలకొంది. కొద్దిసేపటి క్రితమే ఎస్పీ రోహిణి, అదనపుబలగాలు చేరుకున్నాయి.

రామాయంపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి సంతోష్‌, అతని తల్లితో కలిసి కామారెడ్డి పట్టణంలోని ఓ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెట్రోల్ పోసుకొని ఈ దారుణానికి పాల్పడ్డాడు.ఈ సందర్బంగా అతను మున్సిపల్ ఛైర్మన్ జితేందర్ గౌడ్‌తోపాటు మొత్తం ఏడుగురు తమను వేధిస్తున్నారంటూ ఆత్మహత్యకు ముందు మృతులు సంతోష్‌, పద్మలు సెల్ఫీవీడియోలో తెలిపారు. అయితే వారి డెడ్ బాడీలను రామాయంపేటకు తరలించిన బంధువులు.. వీరి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోస్టుమార్టం అనంతరం అంతిమాయత్ర చేపట్టిన బంధువులు.. డెడ్ బాడీలను మున్సిపల్ ఛైర్మన్ ఇంటిముందువేసి ఆందోళనకు దిగారు. మృతుల బంధువులు, స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికిచేరుకొని మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలంటూ వారుడిమాండ్ చేశారు.

ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా ఎస్పీ రోహిణి, అదనపు బలగాలు రామాయంపేటకు చేరుకున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఇంటిదగ్గరకు భారీగా స్థానికులు చేరుకుని ఆందోళన చేస్తున్నారు. అటు వివిధ రాజకీయ పార్టీల నేతలు అక్కడికి చేరుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story