తీవ్ర అస్వస్థతకు గురైన మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి

మాజీ హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్, న్యుమోనియాతో ఆయన జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అడ్వాన్స్‌డ్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్నట్లు వైద్యులు తెలిపారు. గత నెల 28న కరోనా బారిన పడ్డ ఆయన బంజారాహిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆస్పత్రిలో చేరి చికిత్సతీసుకున్నారు. వారం రోజుల క్రితం కరోనా టెస్టులుచేయగా నెగిటివ్ వచ్చింది. త్వరగా కోలుకొని ఇంటికి వెళ్లారు. ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారడంతో ఆయనను మరోసారి పరీక్షించగా.. ఊపిరితిత్తుల ఎన్‌ఫెక్షన్ న్యుమోనియా సోకినట్లు వైద్యులు తెలిపారు. దీంతో నాయిని ఆక్సిజన్ లెవల్స్ పడిపోయాయి. ఆస్పత్రిలో పల్మనాలజీ స్పెషలిస్టు డాక్టర్ సునీతారెడ్డి, కిడ్ని స్పెషలిస్టు డాక్టర్ రవి ఆండ్రూస్ లు నాయినికి వైద్యం అందిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com