Top

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య!

కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చంచల్‌గూడ జైల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన డెడ్‌బాడీని ఉస్మానియా ఆస్పత్రికి..

కీసర మాజీ తహసీల్దార్‌ నాగరాజు ఆత్మహత్య!
X

కీసర మాజీ ఎమ్మార్వో నాగరాజు సూసైడ్ చేసుకుని చనిపోయాడు. చంచల్‌గూడ జైల్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన డెడ్‌బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కొద్ది నెలల కిందట సంచలనం సృష్టించిన కోటి 10 లక్షల లంచం కేసులో నాగరాజు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. హైదరాబాద్ శివారులోని కీసర సమీపంలో ఉన్న రాంపల్లిలో ఒక భూమి మ్యూటేషన్ కోసం రియల్ ఎస్టేట్‌ వ్యాపారులతో డీల్ కుదుర్చుకున్నారు. తర్వాత ఆ కోటి 10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌ హ్యాండెండ్‌గా దొరికిపోయారు. ఈ కేసులో ఇప్పటికే కస్టడీకి తీసుకుని నాగరాజును ప్రశ్నించారు. ఇంతలో ఆయన ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది.

Next Story

RELATED STORIES