CM KCR గద్వాల పర్యటన.. మాజీ MLA సంపత్ కుమార్ గృహనిర్బంధం

CM KCR గద్వాల పర్యటన.. మాజీ MLA సంపత్ కుమార్ గృహనిర్బంధం
నేడు CM KCR గద్వాల పర్యటన సందర్భంగా మాజీ MLA AICC కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు

నేడు CM KCR గద్వాల పర్యటన సందర్భంగా మాజీ మ్మెల్యే AICC కార్యదర్శి డాక్టర్ సంపత్ కుమార్‌ను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. దీంతో ప్రతిపక్ష నాయకులను కుల సంఘాల నాయకులను అరెస్టు చేసి నిర్బంధించడం నీతిమాలిన చర్య అని సంపత్‌ కుమార్‌ తీవ్రంగా విమర్శించారు. ఎన్నో పోరాట ఫలితంగా తెచ్చుకున్న తెలంగాణలో రైతులకు నిరుద్యోగులకు న్యాయం చేయలేక ప్రశ్నించే వారిని అరెస్టు చేసి నిర్బంధించడం సిగ్గుచేటని ఆయన వెల్లడించారు.

అల్లంపూర్‌లో రెండుసార్లు పర్యటించిన సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చక జాప్యం చేస్తూ వాటిని అమలు చేయమని ప్రశ్నించినందుకు నిర్బంధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్వాల జిల్లాలో సీఎం ఇచ్చిన హామిలు అలంపూర్ నియోజకవర్గం రైతులకు వెన్నెముకైనా తుమ్మిళ్ల లిఫ్ట్ రిజర్వాయర్లు మరిచారు,

కాంగ్రెస్ హాయంలో మొదలుపెట్టిన నెట్టెంపాడు BRS ప్రభుత్వం వచ్చిన తర్వాత అల్లంపూర్ నియోజకవర్గం లో ఉన్న ఏ కాలువలో కూడా మట్టి తీసి పొలాలకు నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నం BRS ప్రభుత్వం చేయలేదని ఆరోపించారు.

అల్లంపూర్ కు డిగ్రీ కాలేజ్ లేదు మినీ బస్సు డిపో అలాగే ఫైర్ స్టేషన్ లేదు ఇలా చెప్పుకుంటూ పోతే నియోజకవర్గంలో అభివృద్ధి కుంటబడిందని విమర్శించారు. రాబోయే రోజుల్లో BRS ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నామని సంపత్ కుమార్ పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story