Formula E: హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు రద్దు..

Formula E: హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేసు రద్దు..
రేవంత్ ప్రభుత్వంపై ఘాటుగా స్పందించిన కేటీఆర్

హైదరాబాద్‌లో వచ్చేనెల 10న జరగాల్సిన ఫార్ములా-ఈ రేస్ రద్దయింది. ఈ విషయాన్ని FIA ఫార్ములా-ఈ వెల్లడించింది. ఏర్పాట్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంఘనపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని ఫార్ములా ఈ రేస్ నిర్వాహకులు చెప్పారు. రేసు రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ... రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇది నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న దుర్మార్గమైన, తిరోగమన నిర్ణయమని ఆయన అన్నారు.

హైదరాబాద్ ఈ-ప్రిక్స్ వంటి ఈవెంట్ లు హైదరాబాద్ తో పాటు దేశం బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతాయని చెప్పారు. ఇండియాకు ఈ-ప్రిక్స్ ని తీసుకురావడానికి తాము ఎంతో కృషి చేశామని, చాలా సమయాన్ని వెచ్చించామని తెలిపారు. హైదరాబాద్ ను పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని చెప్పారు. ఎలెక్ట్రిక్ వెహికల్స్ ఉత్పత్తిదారులు, స్టార్టప్ లు హైదరాబాద్ ను పెట్టుబడులకు అనువైన ప్రదేశంగా గుర్తించాయని తెలిపారు. ఇందులో భాగంగానే తెలంగాణ మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశామని అన్నారు. హైదరాబాద్‌ను ఆకర్షణీయమైన పెట్టుబడి గమ్యస్థానంగా చూపడానికి ఈవీ ఔత్సాహికులు, తయారీదారులు, స్టార్టప్‌లను ఆకర్షిస్తూ గత కేసీఆర్ ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్‌ను కొన్ని నెలల క్రితం చక్కగా వాడుకుందని చెప్పారు.

ఇప్పుడు ఈ ఈవెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించలేకపోతోందని అన్నారు. గతంలో హైదరాబాద్ లో నిర్వహించిన ఈవెంట్‌కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

Tags

Read MoreRead Less
Next Story