పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్‌ గణేశుడు .. పూజలకి సిద్దం..!

పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్‌ గణేశుడు .. పూజలకి సిద్దం..!
వినాయక చవితి వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచే ఖైరతాబాద్ గణేషుడు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు.

వినాయక చవితి వేడుకల్లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచే ఖైరతాబాద్ గణేషుడు పూజలు అందుకునేందుకు సిద్ధమయ్యాడు. గత ఏడాది కరోనా కారణంగా నిడారంబరంగా జరిగిన గణేష్ ఉత్సవాలు.. ఈసారి ఎంతో ఘనంగా నిర్వహించబోతున్నారు.1954 లో ఒక్క అడుగుతో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేషుడు.. ప్రతిఏటా ఒక్కో అడుగు పెరుగుతూ వస్తున్నాడు. 2014లో 60 అడుగుల ఎత్తులో షష్టి పూర్తి మహాత్సవం కూడా ఘనంగా జరుపుకున్న ఈ భారీ గణనాథుడు.. ఆ తర్వాత నుంచి ఒక్కో అడుగు తగ్గుతున్నాడు.ఈ ఏడాది శ్రీ పంచముఖ రుద్ర మహా గణపతిగా ఖైరతాబాద్‌ గణేశుడు భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఈసారి 40 అడుగుల ఎత్తులో ఖైరతాబాద్ గణేశుడిని ఏర్పాటు చేసారు నిర్వాహకులు.

గత ఏడాది కరోనాకు మందు రావాలని ధన్వంతరి నారాయణ మహా గణపతి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చిన ఖైరతాబాద్ గణేశుడు.. ఈ యేడు కరోనా పీడ వదలాలని శ్రీ పంచ ముఖ రుద్ర మహా గణపతి రూపంలో ఖైరతాబాద్ గణేష్‌ను ఏర్పాటు చేశారు.ఐదు తలలతో ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దీవెనలు అందించబోతున్నాడు. గణేశుడు, శివ పార్వతులు, విష్ణు, సూర్య భగవానుడు ఇలా 5 తలలతో పంచ ముఖ రుద్ర మహాగణపతిగా ఏర్పాటు చేశారు. అంతే కాదు ఖైరతాబాద్‌ గణేశుడికి కుడివైపు 15 అడుగుల ఎత్తులో కాల నాగేశ్వరి , ఎడమ వైపున 15 అడుగుల ఎత్తులో కృష్ణకాళీ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తూ.. సకల దేవతలు ఖైరతాబాద్‌లోనే ఉన్నారా అన్నట్లు గణేష్ ఉత్సవాలు జరుగుతున్నాయి. మొత్తం 50 లక్షల రూపాయల వ్యయంతో 150 మంది కళాకారులు.. 3 నెలల పాటు ఖైరతాబాద్ గణేష్ తయారీ కోసం శ్రమించారు.

ఇక హైట్‌లో తన ప్రత్యేకతను చాటుకుంటూవచ్చిన ఖైరతాబాద్ గణేషుడు.. కొన్నాళ్లు లడ్డూ నైవేద్యంలో కూడా అందరి దృష్టిని ఆకర్శించాడు. అయితే ఆరేళ్ల క్రితo లడ్డూ పంపిణిలో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో ఐదేళ్ల నుంచి ఖైరతాబాద్ గణేష్ చేతిలో లడ్డు పెట్టడం లేదు. కేవలం బొమ్మ లడ్డు మాత్రమే ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.శుక్రవారం వికాయక చవితి పండుగ సందర్బంగా ఉదయం 11 గంటల 30 నిమిషాలకు గవర్నర్ తమిళ సై దంపతులు ఖైరతాబాద్ గణేషుడికి తొలిపూజ చేయనున్నారు.

ఖైరతాబాద్ పద్మశాలి సంఘము ఆద్వర్యంలో 40 అడుగుల జంజం, 40 అడుగుల కండువా సమర్పిస్తారు. ఇక.. గత ఏడాది మాదిరిగానే ఈ యేడు కూడా ఖైరతాబాద్ గణేషుడిని సెప్టెంబర్ 19న అనంత చతుర్ధశి రోజు మధ్యాహ్నం లోపు నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. వారం రోజుల ముందుగానే దర్శనం ఇస్తున్న ఖైరతాబాద్ గణేష్ సన్నిధిలో అప్పుడే భక్తుల సెల్ఫీల సందడితో కోలాహలంగా మారింది.

Tags

Read MoreRead Less
Next Story