ఈ ఏడు వినాయక నిమజ్ఞనం ఇలాగే..

ఈ ఏడు వినాయక నిమజ్ఞనం ఇలాగే..
వినాయక నిమజ్ఞనం ఈ ఏడాది నిరాడంబరంగా జరగునుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి..

వినాయక నిమజ్ఞనం ఈ ఏడాది నిరాడంబరంగా జరగునుంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రతి ఏటా కన్నుల పండువగా జరిగే వినాయక మహా నిమజ్జనం కరోనా వైరస్ మహమ్మరి కారణంగా కళ తప్పినట్లైంది. గ్రేటర్ వ్యాప్తంగా ప్రతి ఏడాది లక్షా పై చిలుకు వినాయక విగ్రహాలను ప్రతిష్టించి ఘనంగా పూజలు నిర్వహించేవారు. అనంతరం 11వ రోజున నిమజ్జనానికి తరలి వచ్చేవారు. అయితే ఈ సారి కరోనా వైరస్ నేపథ్యంలో ప్రభుత్వ సూచనల మేరకు ఎవరికి వారు ఇళ్లలోనే వినాయకులను ప్రతిష్టించుకుని పూజలు నిర్వహించుకున్న నగరవాసులు ఇప్పటికే పెద్ద సంఖ్యలో నిమజ్జనం చేశారు. అయితే అక్కడక్కడ ఏర్పాటు చేసిన వినాయకులతో పాటు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఖైరతాబాద్ గణనాథుడితో పాటు బాలాపూర్ వినాయకుడి నిమజ్జనం నేడు జరిగనుంది.

గత ఏడాది నిమజ్ఞనానికి 51 క్రేన్లను ఏర్పాటు చేసిన అధికారులు ఈ ఏడాది కేవలం 18 క్రేన్లను మాత్రమే ఏర్పాటు చేశారు. కరోనా వైరస్ కారణంగా ఈ సారి 1 అడుగు నుంచి 9 అడుగుల లోపు గణనాథులను మాత్రమే ప్రతిష్టించడంతో పెద్దగా క్రేన్ల సహాయం లేకుండానే ఇప్పటికే భారీగా వినాయక విగ్రహాల నిమజ్జనం పూరైయింది. గ్రేటర్ వ్యాప్తంగా జిహెచ్‌ఎంసి నిర్మించిన 23గణేష్ నిమజ్జన కొలనుల్లో నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. దీంతో ఈ ఏడాది నిమజ్జనం కోసం హుస్సేన్‌సాగర్‌కు 10వేల లోపు విగ్రహాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లు అంచనా వేసిన అధికారులు ఆ మేరకు మాత్రమే ఏర్పాట్లను చేశారు.

రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో సరూర్‌నగర్ చెరువు వద్ద సైతం అధికారులు నిమజ్జన ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో కూకట్‌పల్లి చెరువు వద్ద ఏర్పాట్లు చేశారు.గణేష్ విగ్రహాలకు ప్రత్యేక రూట్‌మ్యాప్ ఏర్పాటుచేశారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలతో పాటు మరిన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నిమజ్జనం కోసం వచ్చే వాహనాల పార్కింగ్‌కు సంబంధించి ట్యాంక్‌బండ్ చుట్టు పక్క ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశారు.

మధ్యాహ్నం 3 గంటలకు ఖైరతాబాద్‌ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుందని ఖైరతాబాద్‌ ఉత్సవ నిర్వాహకులు తెలిపారు. టెలిఫోన్‌ భవన్‌, తెలుగుతల్లి ఫ్లై ఓవర్‌, ఎన్టీఆర్‌ మార్గ్‌ మీదుగా ట్యాంక్ బండ్‌లోని క్రేన్‌ నెంబర్‌ 4 దగ్గరకు ఈ శోభాయాత్ర చేరుకుంటుందని చెప్పారు. ఆ తర్వాత వినాయకుడి నిమజ్జనం జరుగుతుందని తెలిపారు. భక్తుల విజ్ఞప్తితో ప్రతీ ఏదాడి మాదిరిగానే ఈసారి కూడా ఖైరతాబాద్‌ గణేష్ శోభయాత్ర నిర్వహిస్తున్నామన్నారు. ఊరేగింపునకు భక్తులెవరు రావద్దని పిలుపు నిచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story