టీఆర్ఎస్ మేనిఫెస్టో చెత్తబుట్టతో సమానం : ఉత్తమ్

టీఆర్ఎస్ మేనిఫెస్టో చెత్తబుట్టతో సమానం : ఉత్తమ్

గ్రేటర్‌ ఓటర్లపై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్‌.. మెనీఫెస్టోలో వరుస హామీలు గుప్పించారు. గ్రేటర్‌ పరిధిలో 20వేల లీటర్ల వరకు తాగు నీరు ఉచితంగా అందిస్తామని, నీటి బిల్లులు రద్దు చేస్తామని తెలిపారు. సెలూన్లు, దోబీ ఘాట్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చారు. అయితే కేసీఆర్ విడుదల చేసిన మేనిఫెస్టోపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి.

టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో కొత్తదనమేమి లేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల హామీలనే మళ్లీ ప్రకటించారని.. కనీసం పేజీలు, ఫొటోలు కూడా మారలేదన్నారు ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. హైదరాబాద్‌ ను విశ్వనగరం చేస్తామని.. విషాద నగరంగా మార్చారని మండిపసడ్డారు. ఇటీవల వచ్చిన వరదలతో 40 మంది చనిపోయారని.. లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయని అన్నారు. అలాంటప్పుడు ఇది విశ్వనగరం ఎలా అవుతుందో చెప్పాలని కేసీఆర్ ను ప్రశ్నించారు.

ఇక కాంగ్రెస్ నేతలు కూడా టీఆర్ఎస్ మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు చేశారు.ఆ మేనిఫెస్టో చెత్తబుట్టలో వేయడానికి కూడా పనికిరాదని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తెలిపారు. 2016 గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టోనే మళ్లీ తీసుకువచ్చారని ఆ్రగహం వ్యక్తంచేశారు.

ఓటర్లను ఆకట్టుకునేలా మేనిఫెస్టో రూపొందించామని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. గత మేనిఫెస్టోను మళ్లీ తీసుకువచ్చారని మేనిఫెస్టోలో కొత్తదనమేమి లేదని ప్రతిపక్ష నేతలు విమర్శిస్తున్నారు.


Tags

Read MoreRead Less
Next Story