త్వరలో పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుంది : ఉత్తమ్ కుమార్ రెడ్డి

X
Nagesh Swarna26 Nov 2020 2:59 PM GMT
త్వరలో పీసీసీ అధ్యక్షుడి మార్పు ఉంటుందన్నారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలు లేవని .. టీఆర్‌ఎస్, బీజేపీతో పోల్చితే మా దగ్గరే కుమ్ములాటలు తక్కువని చెప్పారు. గ్రేటర్ ప్రజలు సెక్యులర్ భావాలు కలిగిన కాంగ్రెస్‌ను ఆదరిస్తారన్నారు. బీజేపీకి ఎంఐఎం బి టీమ్‌గా మారిందన్న ఉత్తమ్.. బీజేపీ మతతత్వ రాజకీయాలు తెలంగాణలో నడవవని స్పష్టం చేశారు. బండి సంజయ్‌కు హైదరాబాద్‌పై అవగాహన లేదని.. పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ పిచ్చిమాటలన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ పూర్తిగా అవినీతిమయం అయ్యిందన్న ఉత్తమ్.. కేంద్రం తెలంగాణకు ఒక్క పైసా పని చేయలేదన్నారు.
Next Story