జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి.. మూడు రోజులు బయటకు రావొద్దు

జీహెచ్‌ఎంసీ విజ్ఞప్తి.. మూడు రోజులు బయటకు రావొద్దు
మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కనీసం..

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు హైదరాబాద్ నగర శివారు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. నగరంలోని అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. దాదాపు 1500 కాలనీల్లో అపార్ట్ మెంట్లలోని సెల్లార్లు నీటితో నిండిపోయాయి. వీధులు, కాలనీల్లో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు బోట్ల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో కనీసం మూడు రోజులు నగరంలోని ప్రజలు బయటకు రావొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.

అత్యవసర సేవల కోసం 040-211111111, జీహెచ్‌ఎంసీ విపత్తు నిర్వహణ శాఖ - 90001 13667, 97046 01866, జీహెచ్‌ఎంసీ పరిధిలో చెట్లు తొలగించే సిబ్బంది కోసం 63090 62583, జీహెచ్‌ఎంసీ విద్యుత్ శాఖ 94408 13750, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ సేవల కోసం 83330 68536, 040 2955 5500 నెంబర్లను సంప్రదించాలని అధికారులు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story