GHMC మేయర్ ఎన్నికకు ముహూర్తం ఫిక్స్!

జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నికకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11న మధ్యాహ్నం 12.30కి మేయర్ తో పాటుగా డిప్యూటీ మేయర్‌ను ఎన్నుకోనున్నారు. అదే రోజు ఉదయం 11 గంటలకు కొత్త కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం జీహెచ్‌ఎంసీ మేయర్ ఎన్నికకు సంబంధించి ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎన్నికల పర్యవేక్షణకు సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించనున్నారు. చూడాలి జీహెచ్ఎంసీ మేయర్ కుర్చీ ఎవరిని వరిస్తుందో..
కాగా, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ పాలకమండలి పదవీకాలం ఈనెల 10వ తేదీతో ముగిసింది. 2016 ఎన్నికల్లో 99 చోట్ల నెగ్గి ఏకపక్షంగా గ్రేటర్ మేయర్ పీఠాన్ని సొంతం చేసుకున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఈసారి ఏకంగా 44 స్థానాలు తగ్గించుకొని 55 సీట్లకే పరిమితమైంది. అటు బీజేపీ 48 డివిజన్లలో విజయం సాధించగా, కాగా మజ్లిస్ మరోసారి తన బలాన్ని చాటుతూ 44 స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ రెండు డివిజన్లను మాత్రమే గెలుచుకుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com