Top

హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై వాస్తవాల కంటే రూమర్స్‌ ఎక్కువ ఉన్నాయి: పార్థసారధి

హైదరాబాద్‌లో శాంతిభద్రతలపై వాస్తవాల కంటే రూమర్స్‌ ఎక్కువ ఉన్నాయి: పార్థసారధి
X

హైదరాబాద్‌లో ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ పార్థసారధి తెలిపారు. శాంతిభద్రతలపై వాస్తవాల కంటే రూమర్స్‌ ఎక్కువ ఉన్నాయని చెప్పారు. పోలీసులు అందరూ అప్రమత్తంగా ఉన్నారని స్పష్టంచేశారు. చిన్నచిన్న గొడవలు మినహా పెద్దగా ఏమీ జరగలేదని అన్నారు. ఓల్డ్‌ మలక్‌పేట్‌లో సీపీఐ గుర్తు తప్పుపడిందని చెప్పారు. ప్రింటింగ్‌ ప్రెస్‌లో సింబల్‌ తప్పుగా ప్రింటయిందని తెలిపారు. ఉదయం మెటీరియల్‌ విప్పి చూసే వరకు తప్పు గుర్తించలేదని అన్నారు. కొవిడ్‌, చలి కారణంగా ఓటింగ్‌ శాతం తగ్గిందని పార్థసారధి చెప్పారు.


Next Story

RELATED STORIES