బ్రేకింగ్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

బ్రేకింగ్.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 11 గంటల తర్వాతే మొదటి రౌండ్‌ ఫలితం వచ్చే అవకాశం ఉంది. 30 కేంద్రాల్లో 150 కౌంటింగ్ హాళ్లలో ఈ లెక్కింపు జరుగుతోంది. ఒక్కో రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కించనున్నారు. ఐతే.. 12 వేల లోపు ఓట్లు పోలైన మెహదీపట్నం ఫలితం ముందుగా వచ్చే ఛాన్స్ ఉంది. అత్యధికంగా 37 వేల ఓట్లు పోలైన మైలార్‌దేవ్‌పల్లిలో కౌంటింగ్‌ పూర్తికావాలంటే సాయంత్రం అవుతుంది. అలాగే గాజులరామారం, అల్లాపూర్‌ సహా మరికొన్ని చోట్ల కూడా ఫలితం తేలాలంటే మరింత సమయం పడుతుంది. గతంలో EVMల ద్వారా ఓటింగ్ కాబట్టి.. తొలి రెండు గంటల్లోనే ట్రెండ్ తెలిసిపోవడం, ఫలితాలు ఎవరికి అనుకూలంగా ఉన్నాయో అర్థమవడం జరిగిపోయేది. కానీ ఈసారి బ్యాలెట్ పోరు కావడంతో రిజల్ట్ ఆలస్యం కానుంది.

ఇక కౌంటింగ్‌లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆసక్తికరంగా ఉంది. ఎప్పట్లాగే ముందు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తున్నారు. తర్వాత బ్యాలెట్‌ బాక్స్‌లను తెరిచి.. అందులో ఓట్లను 25 చొప్పున కట్టలు కడుతున్నారు. పోలైన ఓట్లు, బాక్సులో ఓట్లు సమానంగా ఉన్నాయో లేదో సరిచూసుకుంటారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లోని బాక్సుల్లో ఓట్లు కట్టలు కట్టాక వాటిని ఓ డ్రమ్‌లో వేసి కలుపుతారు. ఏ వార్డులో ఏ పార్టీకి మెజార్టీ వచ్చింది లాంటి వివరాలు బయటకు తెలియకుండా ఉండడం కోసం ఇలా చేస్తారు. ఆ తర్వాత పార్టీల వారీగా అభ్యర్థులకు వచ్చిన ఓట్లను లెక్కించి రౌండ్ల వారీగా ఫలితాలు ప్రకటిస్తారు. ఒక్కో టేబుల్‌పైన వెయ్యి ఓట్లు లెక్కిస్తారు. అలా ఒక రౌండ్‌లో 14 వేల ఓట్లు లెక్కిస్తారు. క్యాండేట్ల వారీగా చెల్లుబాటు అయిన ఓట్లు ప్రకటించాక, రీకౌంటింగ్‌ లాంటి డిమాండ్‌లు ఏమీ ఏజెంట్ల నుంచి రాకపోతే రిటర్నింగ్ అధికారి ఫలితాన్ని ప్రకటిస్తారు. డౌట్ ఫుల్ ఓట్ల విషయంలో రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయం. ఒకవేళ ఎక్కడైనా డివిజన్‌లో అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లక్కీ డ్రా ద్వారా విజేతను ప్రకటిస్తారు.

కౌంటింగ్‌ ప్రక్రియ మొత్తం వీడియోగ్రఫీ చేస్తున్నారు. సర్కిళ్ల వారీగా ఎన్నికల సంఘం నియమించిన అబ్జర్వర్లు కౌంటింగ్‌ పర్యవేక్షిస్తున్నారు. IAS, IPS, IFS సహా డిప్యూటీ కలెక్టర్లు 31 మందికి ఆ బాధ్యతల్లో ఉన్నారు. మరోవైపు కౌంటింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సుమారు 50వేల మంది సిబ్బంది విధుల్లో ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story