Ghoshamahal: ఉన్నట్లుండి కుంగిన రద్దీ రోడ్డు; ఘోషామహల్ లో కలకలం

Hyderabad
Ghoshamahal: ఉన్నట్లుండి కుంగిన రద్దీ రోడ్డు; ఘోషామహల్ లో కలకలం
రైతుబజారుకు జోరుగా సాగుతున్న ఏర్పాట్లు, ఉన్నట్లుండి కుంగిన నాలాపై రోడ్డు; ఘోషామహల్ లో కలకలం సృష్టించిన ఘటన

Ghoshamahal: ఉన్నట్లుండి కుంగిన రద్దీ రోడ్డు; ఘోషామహల్ లో కలకలం


నిత్యం జనాలతో కిటకిటలాడే ఘోషామహల్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. చక్కన్వాడి ప్రాతంలో నాలా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. నాలాపై నిలిపి ఉంచిన వాహనాలతో పాటు షాపులు కూడా నాలాలో పడిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగారు.


చాక్కన్వాడిలో 30 ఏళ్ల క్రితం నాటి ఓ నాలా పై నిర్మించిన రోడ్డు ఒక్కసారిగా కుంగిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న కార్లు, బైకులు, ఆటోలు అందులోకి పడిపోయాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లుగా సమాచారం అందుతోంది.


ఈ ప్రమాదం చోటుచేసుకున్న సమయంలో అక్కడ రైతు బజార్ కు ఏర్పాట్లు జరగుతున్నాయి. నాలాపైనే కూరగాయాలు, ఇతర సరుకులను విక్రయించేందుకు వ్యాపారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఒక్కసారిగా నాలా కుంగిపోవడంతో కూరగాయలు, సరుకులన్నీ నాలాలోకి పడిపోయాయి. ఇక ఈ ప్రాంతంలో పార్క్ చేసిన వాహనాలు నాలాలో పడిపోగా, ఇందులో కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు కూడా ఉన్నాయి.


రోడ్డు కుంగే సమయంలో రద్దీ తక్కువగా ఉండటం, వాహనాల రాకపోకలు లేకపోవటంతో పెను ప్రమాదం తప్పిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. నాలా కూలిపోవటానికి గల కారాణాలను ఆరా తీశారు.

Tags

Read MoreRead Less
Next Story