తెలంగాణ

ఆసిఫాబాద్‌ జిల్లాలో బాలికను బలితీసుకున్న పెద్దపులి

ఆసిఫాబాద్‌ జిల్లాలో బాలికను బలితీసుకున్న పెద్దపులి
X

ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్దపులి మరోసారి పంజా విసిరింది. చేనులో పత్తి ఏరడానికి వెళ్లిన ఓ బాలికను బలితీసుకుంది. పెంచికల్‌ పేట మండలం కొండపల్లి గ్రామానికి చెందిన నిర్మల పత్తి చేనుకు వెళ్తుండగా.. పొదల మాటున పొంచి ఉన్న పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో బాలిక అక్కడికక్కడే మృతి చెందింది.

కొద్ది రోజుల క్రితం ఇదే ప్రాంతంలోని దిగడ గ్రామంలో పెద్దపులి ఓ యువకుడిని చంపేసింది. ఆ తర్వాత కూడా ఇదే ప్రాంతంలో పులి తిరగడం చాలా మంది చూశారు. రెండు రోజుల క్రితమే ఓ వాగులో పులి నీరు తాగుతున్న దృశ్యాలను.. స్థానికులు కెమెరాల్లో బంధించారు. రెండు దాడులు జరిగింది ఒకే ప్రాంతం కావడంతో.. నిర్మలను చంపింది కూడా మ్యాన్‌ ఈటర్‌గా మారిన పులే అని అటవీ అధికారులు భావిస్తున్నారు.


Next Story

RELATED STORIES