నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. తెలంగాణలో భారీగా ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

నిరుద్యోగ యువతకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. రాష్ట్రంలో ఖాళీ అయిన వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తుంది. ఈ మేరకు సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేశారు. ఉపాధ్యాయ, పోలీసు శాఖలతో పాటు వివిధ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. ఖాళీగా ఉన్న పోస్టులన్నింటి వివరాలు సేకరించి.. త్వరగా నోటిఫికేషన్‌ విడుదల చేయాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో దాదాపు 50 వేల వరకు ఖాళీలున్నట్లు ప్రాథమిక సమాచారం. వాటన్నంటినీ భర్తి చేయాలని.. వేల సంఖ్యలో ఉపాధ్యాయులు, పోలీసుల రిక్రూట్మెంట్ జరగాల్సి ఉందన్ని కేసీఆర్‌ అన్నారు. ఈ రెండు విభాగాలతో పాటు రాష్ట్రంలోని ఇతర శాఖల్లో ఉన్న ఖాళీల వివరాలు వెంటనే సేకరించాలని.. ఇంకా ఏఏ శాఖల్లో ఎంత మంది ఉద్యోగుల అవసరం ఉందో లెక్క తేల్చాలని అధికారులకు సూచించారు. అలా లెక్క తేలిన వెంటనే భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్లు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు.



Tags

Read MoreRead Less
Next Story