ఆర్టీసీ యూనియన్ నేతలకు గవర్నర్ పిలుపు

ఆర్టీసీ యూనియన్ నేతలకు గవర్నర్ పిలుపు
వారి ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు గవర్నర్

ఆర్టీసీ యూనియన్ నేతలకు రాజ్ భవన్ నుంచి పిలుపు వచ్చింది.యూనియన్ లీడర్లు రాజ్ భవన్ లోకి రావాలని పిలుపు రావడంతో చర్చించేందుకు 10 మంది యూనియన్ నేతలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలకు వెళ్లారు.

మరోవైపు ఆర్టీసీ బిల్లుపై ఐదు అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ కోరారు గవర్నర్ తమిళి సై. బిల్లుపై కొన్ని సందేహాలను వ్యక్తం చేస్తూ వాటిని క్లారిఫై చేయాలని గవర్నర్ తమిళిసై సీఎస్ శాంతికుమారికి లేఖ రాశారు. బిల్లును నిన్నే అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావించింది. గవర్నర్ అనుమతి రాకపోవడంతో ఆగింది. గవర్నర్ కావాలనే బిల్లును ఆపుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆర్టీసీ కార్మిక సంఘాలు ఆందోళనలు చేస్తున్నాయి. దీంతో రాజ్ భవన్ ప్రకటన విడుదల చేసింది.

1958 నుండి ఆర్టీసీ లో కేంద్ర గ్రాంట్ లు, వాటాలు, లోన్లు, ఇతర సహాయం గురించి బిల్లులో ఎలాంటి వివరాలు లేవని గవర్నర్‌ రాసిన లేఖలో ప్రస్త్రావించారు అలాగే రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9 ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడంపై సమగ్ర వివరాలు బిల్లులో లేవని.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం...వారి సమస్యలకు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ చట్టం, కార్మిక చట్టాలు వర్తిస్తాయా, వారి ప్రయోజనాలు ఎలా కాపాడతారని ప్రశ్నించారు గవర్నర్.

ఇక విలీనం డ్రాఫ్ట్ బిల్లులో ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ ఇస్తారా..? వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ప్రయోజనాలు ఇవ్వడాని కి సంబంధించి స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్. ప్రభుత్వ ఉద్యోగులలో కండక్టర్, కంట్రోలర్ లాంటి తదితర పోస్టులు లేనందున వారి ప్రమోషన్లు, వారి క్యాడర్ నార్మలైజేషన్ లాంటి విషయాల్లో ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం, ఇతర ప్రయోజనాలు అందే విధంగా స్పష్టమైన వివరాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్.

Tags

Read MoreRead Less
Next Story