రాజకీయ డ్రామా చేయడానికి రాజ్‌భవన్ అడ్డా కాదు : తమిళిసై

అపాయింట్మెంట్ ఇవ్వలేదంటూ కాంగ్రెస్ చేసిన ఆరోపణలను తెలంగాణ గవర్నర్ తమిళిసై ఖండించింది. రాజకీయ డ్రామా చేయడానికి రాజ్‌భవన్ అడ్డా కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా ఎవరికీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని...4 నెలలుగా రాజ్‌భవన్ ఇదే విధానాన్ని అవలంభిస్తోందని స్పష్టం చేశారు. సమస్యలుంటే ఈ మెయిల్ ద్వారా ఎప్పుడైనా ఫిర్యాదు చేయవచ్చుని చెప్పారు గవర్నర్ తమిళిసై. రాజ్‌భవన్‌కు రాజకీయాలు ఆపాదించొద్దని...తాను డాటర్ ఆఫ్ తమిళనాడు..సిస్టర్ ఆఫ్ తెలంగాణ అని స్పష్టం చేశారు. త్వరలోనే తెలుగు నేర్చుకుంటానని చెప్పారు తమిళిసై.
కరోనా కేసుల రికవరీలో తెలంగాణ ముందుందని... క్రమంగా ఉద్ధృతి తగ్గుతుందని తమిళిసై చెప్పారు. ప్రభుత్వం చేపట్టిన నివారణ చర్యలతోనే వైరస్ అదుపులోకి వస్తోందని తెలిపారు.. తెలంగాణ రైస్‌బౌల్‌ఆఫ్ ఇండియాగా ఉండటం గర్వంగా ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com