సుమారు 50 మంది బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ

సుమారు 50 మంది బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ


ములుగు జిల్లా ఏటూరునాగారంలోని ఓ వీధికి చెందిన సుమారు 50 మంది బ్యాంకు ఖాతాల్లో వేలల్లో డబ్బులు జమయ్యాయి. ఎవరు పంపారో, ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక వారంతా ఆశ్చర్యపోయారు. 2 వేల నుంచి మొదలుకుని 5 వేలు, 10 వేలు, లక్ష వరకు జమయ్యాయి. ఖాతాలో డబ్బులు పడినట్లు మొబైల్‌ ఫోన్లకు మెసేజ్‌ వచ్చింది. పొరపాటున తమ అకౌంట్లలో డబ్బులు పడ్డాయని భావించిన ఖాతాదారుల్లో కొందరు....ఫోన్‌పే, గూగుల్‌ పే ద్వారా ఇతర ఖాతాలకు నగదును బదిలీ చేశారు. ఇందులో ఎస్బీఐ, పీఎన్‌బీ, ఏపీజీవీబీ, కెనరా సహా పలు బ్యాంకుల ఖాతాదారులున్నారు.

ఖాతాల్లో డబ్బులు పడ్డ విషయం తెలుసుకున్న ఇంటెలిజెన్స్‌ వర్గాలు, స్థానిక పోలీసులు ఆ ప్రాంతానికి వెళ్లి ఆరా తీశారు. అయితే వారికి ప్రభుత్వమే డబ్బులు జమ చేసిందని నిర్ధారించారు. 2016లో తునికాకు సేకరణకు సంబంధించిన బకాయిలను ఇప్పుడు వారి ఖాతాల్లో జమ చేసినట్టు అధికారుల ద్వారా తెలుసుకున్నారు. మొత్తానికి ఈ ఘటన అందరినీ ఆశ్చర్యపరించింది. 2016లో ఇవ్వాల్సిన డబ్బులను ఇప్పటివరకు ఇవ్వకుండా జాప్యం చేశారా అని కొందరు ముక్కున వేలేసుకున్నారు. ఇప్పటికైనా తమ డబ్బులు తమకు వచ్చాయని... తునికాకు వ్యాపారులు సంతోషం వ్యక్తం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story