తెలంగాణ

గ్రేటర్ లో‌ మంచినీటి సమస్యను 95శాతం వరకూ పరిష్కరించాం : మంత్రి కేటీఆర్

గ్రేటర్ లో‌ మంచినీటి సమస్యను 95శాతం వరకూ పరిష్కరించాం : మంత్రి కేటీఆర్
X

గ్రేటర్‌ ప్రజల తాగునీటిసమస్యను తప్పించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనన్నారు మంత్రి కేటీఆర్‌. మంచినీటి సమస్యను 95శాతం వరకు పరిష్కరించామన్నారు. 6 నెలల్లో కేశవాపురం రిజర్వాయర్‌ నీళ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చాక నగరంలో పేకాట, గుడుంబా క్లబ్లులు మూతపడ్డాయన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయన్నారు మంత్రి కేటీఆర్‌. తెలంగాణకు ఆర్థిక ఇంజిన్‌ హైదరాబాద్‌న్నారు మంత్రి కేటీఆర్‌. విజయగర్వం లేకుండా అందరూ అణుకువగా ఉండాలన్నారు కేటీఆర్‌

గ్రేటర్‌లో నామినేషన్ల ప్రక్రియ ముగియడంతో ఇక ప్రచారం జోరందుకోనుంది. మంత్రి కేటీఆర్ రోడ్‌షోలు ఖరారయ్యాయి. శనివారం నుంచి గ్రేటర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు కేటీఆర్‌. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు రోడ్‌షోలు చేయనున్నారు. శనివారం కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌లో కేటీఆర్ ప్రచారం చేయనున్నారు. ఆదివారం మహేశ్వరం, ఎల్బీనగర్‌లో కేటీఆర్ రోడ్‌షో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల కోసం స్టార్ క్యాంపెయినర్స్‌ను ప్రకటించింది టీఆర్‌ఎస్‌. సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, తలసాని, ఈటల, మంత్రులు సత్యవతి, సబితా, మహమూద్‌అలీ, కొప్పుల, పువ్వాడ అజయ్ పేర్లను హైకమాండ్ వెల్లడించింది.

Next Story

RELATED STORIES