BJP: హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్.. నేరుగా ప్రధాని మోదీతో..

BJP: హైదరాబాద్ బీజేపీ కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్.. నేరుగా ప్రధాని మోదీతో..
BJP: రాష్ట్రంలో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు గ్రేటర్ ఎన్నిక‌ల‌ను ఆయుధంగా వాడుకుంది బీజేపీ నాయ‌క‌త్వం.

BJP: రాష్ట్రంలో టీఆర్ఎస్ ను దెబ్బకొట్టేందుకు గ్రేటర్ ఎన్నిక‌ల‌ను ఆయుధంగా వాడుకుంది బీజేపీ నాయ‌క‌త్వం. రాష్ట్ర నాయ‌క‌త్వంతో పాటు జాతీయ నాయ‌క‌త్వం కూడా తీవ్రంగా శ్రమించింది. రాష్ట్రంలో తిరుగులేని పార్టీగా ఉన్న టీఆర్ఎస్ ను దెబ్బకొట్టి, ఆ పార్టీ ఎత్తుల‌కు.. పై ఎత్తులు వేస్తూ గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల్లో భారీగా సీట్లు సాధించింది. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా 48సీట్లను పార్టీ గెలుపొందింది. ఇక గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల కోసం ఆనాడే జాతీయ నామ‌క‌త్వం ప‌క్కాప్లాన్ సిద్దం చేసింది. ఈ ఎన్నిక‌ల ప‌రిశీల‌కుడిగా జాతీయ ప్రధాన కార్యద‌ర్శి భూపేంద‌ర్ యాద‌వ్ ను నియ‌మింది.

పార్టీ న‌మ్మ‌కాన్ని వ‌మ్ముచేయ‌కుండా పార్టీకి భారీగా సీట్లు గెలిపించ‌డంలో ఆయ‌న ప్లాన్ వ‌ర్కౌట్ చేసారు. ఎన్నిక‌ల్లో TRS పార్టీ ఎత్తుగ‌డ‌ల‌ను చిత్తుచేస్తూ , ఆ పార్టీ వేసిన స్కెచ్ ను ప్రజ‌ల్లో చిత్తుచేయ‌డంలో స‌క్సెస్ అయ్యారు బీజేపీ నేత‌లు. వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో ప్రక‌టించిన 10వేల రూపాయ‌ల ఆర్థిక సాయం హామీ టీఆర్ఎస్ కే దీనివల్ల వ్యతిరేఖ ఫ‌లితాలు తెచ్చేలా చేయ‌డంలో కూడా విజ‌యం సాదించారు బీజేపీ నేత‌లు. ఇక మ‌రోవైపు బండి సంజ‌య్ చేసిన విస్తృత ప్రచారం సైతం ఆ పార్టీకి క‌లిసి వ‌చ్చాయ‌ని పార్టీలో చర్చసాగింది.

సంజ‌య్ గ్రేట‌ర్ ఎన్నిక‌ల సంద‌ర్భంగా చేసిన వ్యాఖ్యలు న‌గ‌ర వాసుల‌ను ఆలోచింప జేసేలా ఉన్నాయ‌ని.. మ‌రికొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు సైతం ప్రజ‌ల్లోకి పార్టీని తీసుకెళ్ళ‌డంలో స‌క్సెస్ అయ్యాయ‌ని చెబుతారు పార్టీ నేత‌లు. ఇక జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల్లో గెలుపొందిన కార్పోరేట‌ర్లకు ప్రధాన మంత్రితో స‌మావేశం ఏర్పాటు చేస్తామంటూ రాష్ట్ర బండి సంజ‌య్ హామీ ఇచ్చారు. అయితే ఈ విష‌యం గ‌త ఏడాది కాలంగా వాయిదా ప‌డుతూ వ‌స్తోంది. మ‌రోవైపు రెండ‌వ విడ‌త‌ ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు స‌భ‌కు న‌గ‌రం నుండి భారీగా జ‌న‌స‌మీక‌ర‌ణ చేసి విజ‌య‌వంతం చేస్తే మోదీని క‌లిపిస్తానంటూ మరోసారి హామీ ఇచ్చారు.

అనుకున్న విధంగానే స‌భ స‌క్సెస్ కావ‌డంతో సంజ‌య్ మోదీతో కార్పేట‌ర్ల స‌మావేశానికి ఏర్పాట్లు చేసారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి సైతం చొర‌వ తీసుకున్నట్టు తెలుస్తోంది. మోదీ హైద‌రాబాద్ సస్కెస్ చేసుకుకుంటున్నారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతం కోసం జాతీయ నాయ‌క‌త్వం వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా పీఎంఓ నుండి కేంద్ర మంత్రికి కార్పోరేట‌ర్ల తో స‌మావేశానికి సంభందించి ఏర్పాట్లు చేసుకోవాలంటూ పిలుపు వ‌చ్చింది.

ఈ నెల 7న లేదా 8వ తారీఖున కార్పోరేట‌ర్ల‌ను అందుబాటులో ఉంచ‌మ‌ని పీఎంవో కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి స‌మాచారం ఇవ్వడంతో కార్పోరేట‌ర్ల‌ను అందుబాటులో ఉంచాలంటూ అధ్యక్షుడు బండి సంజ‌య్ కి సూచించిన‌ట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీని క‌లిసేందుకు పిలుపు రావ‌డంతో కార్పోరేట‌ర్లు సైతం కుషీకుషీగా ఉన్నార‌ట‌. మోదీ హైద‌రాబాద్ కు వ‌చ్చిన సంద‌ర్భంగా కేవ‌లం రిసీవ్ చేసుకోవ‌డం లేదా.. వీడ్కోలు ప‌ల‌క‌డం మాత్రమే చేసామ‌ని.. ఇప్పుడు ప్రధాని మోదీతో స‌మావేశం అయ్యేందుకు అవ‌కాశం రావ‌డం సంతోషంగా ఉంద‌ని చెబుతున్నారు.

అయితే గ్రేట‌ర్ హైద‌రాబాద్ లో గెలిచిన బీజేపీ కార్పోరేట‌ర్ల‌పై అధికార టీఆర్ఎస్ పార్టీ నిఘా తీవ్రత‌రం చేయడంతో పాటు టీఆర్ఎస్ లోకి రావాలంటూ ఒత్తిడి పెరుగుతోంద‌ని పార్టీ నాయ‌క‌త్వం వ‌ద్ద కార్పోరేట‌ర్లు వాపోయిన‌ట్టు తెలుస్తోంది. దీంతో మోదీతో ఆపాయింట్ మెంట్ ఇప్పించ‌డం ద్వారా వారిలో బ‌రోసా నింప‌డం , బీజేపీ మీకు అండ‌గా ఉంటుంద‌న్న ధైర్యం ఇచ్చేందుకు ఈ స‌మావేశం ఉప‌యోగ ప‌డుతుంద‌ని బీజేపీ నాయ‌క‌త్వం భావిస్తోంద‌ట‌. మ‌రి ప్రధాని మోదీతో ప్రత్యేక స‌మావేశం త‌రువాత కార్పోరేట‌ర్లలో ఎలాంటి జోష్ వ‌స్తుంది.. టీఆర్ఎస్ పార్టీ ఒత్తిళ్లను త‌ట్టుకుని పార్టీలో కొన‌సాగుతారు..పార్టీ భ‌లోపేతం కోసం ఉత్సాహంగా ప‌నిచేస్తారా మరి వేచి చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story