గ్రేటర్‌ ఎన్నికలు : బీజేపీ మేనిఫెస్టో విడుదల

గ్రేటర్‌ ఎన్నికలు : బీజేపీ మేనిఫెస్టో విడుదల

అన్ని వర్గాల ప్రజలకు ఏంకావాలో తాము అర్థం చేసుకుని బీజేపీ గ్రేటర్‌ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించామన్నారు మహారాష్ట్ర మాజీ సీఎం ఫడ్నవీస్‌. మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో ఫడ్నవీస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, పార్టీ నేతలు లక్ష్మణ్, డీకే ఆరుణ, వివేక్ తదితరులు హాజరయ్యారు. హైదరాబాద్‌ వరదల్లో నష్టపోయినవారికి రూ. 25 వేలు సాయం చేస్తామన్నారు. కరోనా వ్యాక్సిన్‌ను ఉచితంగా అందిస్తామని..

ప్రజలపై భారంగా మారిన LRSను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాస్‌ యోజన కింద ఇళ్లు నిర్మిస్తామన్నారు ఫడ్నవీస్‌. 10 వేల కోట్లతో మూసీ ప్రక్షాళన చేసి.. డ్రైనేజీ వ్యవస్థను రద్దు చేస్తామన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story