Green India Challenge: కేటీఆర్ కు అలీ బర్త్ డే గిఫ్ట్...

Green India Challenge: కేటీఆర్ కు అలీ బర్త్ డే గిఫ్ట్...
సినీ నటులు శ్రీకాంత్, ఉమ, ఉత్తేజ్ కు ఛాలెంజ్ విసిరిన అలీ..

హరిత హారం స్ఫూర్తితో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరు గాంచింది. ఈ రోజు మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అమీర్ పేట్ సారధి స్టూడియోలో ప్రముఖ సినీ నటుడు నటుడు అలీ మొక్క నాటారు. ఇలా మొక్క నాటి మంత్రి కేటీఆర్ కి శుభాకాంక్షలు తెలపడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. మనం నాటిన మొక్కలు పెరిగి పెద్దయి, భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ ను అందిస్తాయని అలీ చెప్పారు. ప్రతి ఒక్కరు ఇలా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు. ఆ తర్వాత సినీ నటులు శ్రీకాంత్, ఉమ, ఉత్తేజ్.. ఈ ముగ్గురికి కూడా అలీ.. ఛాలెంజ్ విసిరారు.


సృష్టికి మూలమైన ప్రకృతిని పదిలంగా కాపాడుకున్నప్పుడే భవిష్యత్‌ తరాలు సుఖసంతోషాలతో వర్ధిల్లుతాయని సీఎం కేసీఆర్‌ చెప్పిన మాటలను నిజం చేయాలన్న సంకల్పంతో గత ఐదేళ్లుగా కోట్లాది మొక్కలను నాటిన స్ఫూర్తితో ప్రతి ఏడాది ఈ మహాయజ్ఞాన్ని సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్నారు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్. పర్యావరణ హితం, దేశవ్యాప్తంగా పచ్చదనం కోరుకుంటూ ఆయన ఈ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు.


2018లో సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించారు ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్. ప్రతిఒక్కరూ మూడు మొక్కలు నాటు మరో ముగ్గుర్ని మొక్కలు నాటాల్సిందిగా ఛాలెంజ్ విసరాలనే స్ఫూర్తితో దీన్ని ప్రారంభించారు. దీనికి అనతికాలంలోనే అద్భుతమైన స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా ఉద్యమరూపం దాల్చింది. అనేక రంగాల ప్రముఖులు ఇందులో పాల్గొని మొక్కలు నాటారు. దేశం నలువైపులా విస్తరించిన ఈ కార్యక్రమం హరిత స్ఫూర్తితో కొనసాగుతోంది. కొంత కాలంగా ఇది గిన్నిస్ రికార్డులతో పాటు ముక్కోటి వృక్షార్చన, ఊరూరా జమ్మిచెట్టులాంటి వినూత్న కార్యక్రమంలతో కోట్లాది మొక్కలు నాటారు. అటవీ ప్రాంతాలను దత్తత తీసుకొని అక్కడ పచ్చదనం పెంచేలా చేశారు. పుట్టినరోజుతో పాటు ఏ ఇంట ఎలాంటి వేడుక జరిగినా మొక్కనాటి పండగ చేసుకోవటం ఇప్పుడు ఆనవాయితీగా మారింది.

పుడమిని రక్షించుకుందాం, నేలతల్లిని క్షీణించకుండా కాపాడుకుందాం అంటూ సేవ్‌ సాయిల్ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు సద్గురు జగ్గీ వాసుదేవ్. సేవ్‌ సాయిల్‌ అంటూ ప్రపంచ యాత్ర చేపట్టిన విషయం తెలిసిందే. అయితే గతేడాది ఎంపీ సంతోష్‌కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ గురించి తెలుసుకున్న సద్గురు జగ్గీ వాసుదేవ్... మొక్కలు నాటే ఈ మహత్కార్యంలో తాను కూడా పాల్గొనేందుకు సుముఖత తెలిపారు. అందులో భాగంగా శంషాబాద్‌ సమీపంలోని ముచ్చింతల్‌రోడ్‌లో గొల్లూరు ఫారెస్ట్ పార్క్‌లో ఎంపీ సంతోష్‌కుమార్ తో కలిసి మొక్కలు నాటారు. గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ 5.0 ను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్ ప్రేమికులు, సద్గురు మార్గాన్ని అనుసరిస్తున్న అభిమానులు భారీగా తరలివచ్చారు.



Tags

Read MoreRead Less
Next Story