ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి.. అర్ధరాత్రి గన్‌‌తో బెదిరించి..

ప్రజాప్రతినిధి ఇంటిపై దాడి.. అర్ధరాత్రి గన్‌‌తో బెదిరించి..
X

పెద్దపల్లి జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. శ్రీ రాంపూర్ మండలంలో ఓ ప్రజాప్రతినిధి దేవయ్యని గుర్తు తెలియని వ్యక్తులు గన్స్‌తో బెదిరించారు. అర్ధరాత్రి గన్స్‌తో దేవయ్య ఇంటికి నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు వచ్చారు. హత్యాయత్నం నుంచి దేవయ్య తప్పించుకున్నాడు. ఒకరి వద్ద నుంచి రివాల్వర్ లాక్కొని దేవయ్య విసిరేశాడు. పెనుగులాడుతూ కేకలు వేయడంతో దుండగులు పరారయ్యారు. ఓ భూ వ్యవహారంలో దేవయ్యను బెదిరించేందుకు నలుగురు వచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story