Harish Rao: కావలనే సర్జరీలు చేసే డాక్టర్లకు కఠిన చర్యలు తప్పవు

Harish Rao: కావలనే సర్జరీలు చేసే డాక్టర్లకు కఠిన చర్యలు తప్పవు
సెక్షన్స్ తగ్గించమని చెబుతుంటే, రివర్స్ లో చేస్తున్నారన్న మంత్రి హరీష్‌రావు

కొంతమంది వైద్యులు కావాలనే ముందే డెలివరీలు చేస్తున్నారని, దీనిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హరీష్ రావు హెచ్చరించారు. హైదరాబాద్ లోని పేట్లబురుజు హాస్పిటల్ లో ఇన్ఫెక్షన్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ప్రోగ్రాంను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు తెలంగాణ వచ్చిన తరువాత బెడ్స్ పెరుగుదల, స్టాఫ్ పెంచడం, కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ లాంటి ఎన్నో పథకాలు తీసుకొచ్చామని చెప్పారు. ప్రస్తుతం మదర్ మోర్టాలిటి రేటులో 3వ స్థానం లో ఉన్నామని, భారత సరాసరి కంటే బాగున్నామని, కానీ ఫస్ట్ ప్లేస్ కి రావాలని ఆకాంక్షించారు. రిస్క్ ఉన్న తల్లిని డెలివరీ డేట్ కి ముందు గానే హాస్పిటల్ లో జాయిన్ చెయ్యమని ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలకు మంత్రి సూచించారు. హాస్పిటల్ లో ఇన్ఫెక్షన్ కమిటీలు ఏర్పాటు చేశామన్న ఆయన ఇన్ఫెక్షన్ కంట్రోల్ కి కూడా నిధులు ఉన్నాయని, వాటిని వాడండని ఆదేశించారు.

పేషెంట్లను మీ కుటుంబ సభ్యులుగా భావించండని మంత్రి హరీష్ రావు చెప్పారు. డెత్ ఆడిట్ ఎఫెక్టివ్ గా చెయ్యాలని, పేషెంట్లను నిర్లక్ష్యం చేయకూడదని, జనం డబ్బే నుంచే మీకు జీతాల రూపంలో వస్తోందని తెలిపారు. మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెప్పండన్న మంత్రి.. న్యూట్రిషన్ కిట్స్ 4 లక్షల మంది గర్భవతులకు ఇస్తామని స్పష్టం చేశారు. నార్మల్ డెలివరీ కోసం ప్రెగ్నెన్సీ ఉమెన్ కి ఎక్సర్సైజ్ లు చేయిస్తున్నామని తెలిపారు. సెక్షన్స్ తగ్గించమని చెబుతుంటే, రివర్స్ లో చేస్తున్నారన్న ఆయన సీ సెక్షన్స్ లో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉన్నామని హరీష్‌ రావు గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story