తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు.. హైదరాబాద్ లో కుండపోత..

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు.. హైదరాబాద్ లో కుండపోత..
అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురుస్తునే ఉంది. ..

అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా వర్షం కురుస్తునే ఉంది. హైదరాబాద్ నగరంతోపాటు పలు జిల్లాలను వానలు ముంచెత్తాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని... హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిచ్చింది. భారీ వర్షాలకు శంషాబాద్‌ మండలంలోని సుల్తాన్‌పల్లి కేబీ దొడ్డివద్ద గ్రామం నీటమునిగింది. ఇక్కడ ఈసీ వాగు ఉప్పొంగుతోంది. వరదనీరు ఇళ్లలోకి చేరడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. శంషాబాద్‌ - ఆమ్డాపూర్‌ రూటులోరాకపోకలు నిలిచిపోయాయి. హిమాయత్‌ సాగర్‌కు భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. హైదరాబాద్ శివారు జీడిమెంట్ల ఫాక్స్ సాగర్ వరద కాలువ పొంగింది. పక్కనే ఉన్న ఫస్ట్ ఎవెన్యూ కాలనీ జలదిగ్బంధంలో చిక్కుకుంది.మరోవైపు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో చిన్నమంగళారం వాగు పొంగి ప్రవహిస్తోంది. గండిపేటకు భారీగా వరదనీరు చేరుతోంది.

గత రాత్రి నుంచి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురుస్తోంది. 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదుకావడంతో... పట్టణంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. కలెక్టరేట్‌ ముందు మూడు అడుగుల మేర నీళ్లు నిలిచాయి. అటు జోగులాంబ గద్వాల జిల్లాలో పలు చోట్ల ఇళ్లు కూలిపోయాయి. వాగులు వంగలు పొంగిపొర్లుతున్నాయి. నందిన్నె బ్రిడ్జి వద్ద వరద నీరు భారీ ప్రవహించడంతో.. మట్టిరోడ్డు తెగిపోయింది. కేటీదొడ్డి మండలం నందిన్నె గ్రామంలో..మట్టి ఇళ్లు కూలిపోయాయి.

సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి చిలూకురు మండలంలో వరిపంటలు నీట మునిగాయి. కొన్ని గ్రామాలలో రాకపోకలు పూర్తిగా బంద్‌ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలతో కృష్ణా, మూసీ నదుల్లోకి భారీగా వరదనీరు చేరుతోంది. సూర్యాపేట జిల్లా పెన్‌ పహాడ్ మండలం, నాగులపహాడ్- దోసపహాడ్‌ గ్రామాల మధ్య జలదృశ్యం కనువిందు చేస్తోంది. పై నుంచి సాగర్ ఎడవ కాలువ వెళుతుండగా... కాలు కింద మూసీ పరవళ్లు... ఆకట్టుకుంటున్నాయి. రేపు కూడా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం బలహీన పడినా... ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని, దీని ప్రభావం వల్ల రాగల 24 గంటల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా, రాయలసీమా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

Tags

Read MoreRead Less
Next Story