Top

హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం

హైదరాబాద్‌లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం
X

అల్పపీడన ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.. దీంతో వాగులు, వంకలు ఉప్పొంగిప్రవహిస్తున్నాయి.. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. నాలాలు పొంగి ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, కూకట్‌పల్లి, మియాపూర్‌లో భారీ వర్షం పడింది. రోడ్డుపై మోకాలులోతులో వరద నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు..ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, హయత్ నగర్,కోఠి,బేగంబజార్, బషీర్‌బాగ్‌లోనూ భారీ వర్షం కురిసింది.. అబ్దుల్లాపూర్‌మెట్‌లో-4,సరూర్‌నగర్‌లో-3 సెం.మి., కుశాయిగూడ 5, ఉప్పల్ 4 సెం.మి.వర్షం పడుతోంది.

Next Story

RELATED STORIES