Nalgonda: నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

Nalgonda: నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు
పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు చెరువులను తలపిస్తున్న పంటపొలాలు ఉధృతంగా ప్రవహిస్తున్న బిక్కేరు వాగు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద కారణంగా పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా గుండాల సమీపంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుండాల- నూనెగూడెం, గంగపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆత్మకూరులో కుండపోత వర్షం కురుస్తోంది.

భారీ వర్షాలకు ముకుందాపురం రహదారి నీటిలో మునిగిపోయింది. మరోవైపు నిర్మాణంలో ఉన్న అప్రోచ్‌ రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు సూర్యపేట పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దంతాలపల్లి-సూర్యపేట రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి జగదీస్‌ రెడ్డి. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా అధికారులకు పలు సూచలను చేశారు.

Tags

Read MoreRead Less
Next Story