అవంతిని ఆరుగంటలపాటు విచారించిన గచ్చిబౌలి పోలీసులు

అవంతిని ఆరుగంటలపాటు విచారించిన గచ్చిబౌలి పోలీసులు
X
తన మామకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఆడియో రికార్డులను పోలీసులకు అందజేసినట్లు అవంతి తెలిపారు.

హేమంత్ కేసు విచారణ సందర్బంగా అవంతి గచ్చిబౌలి పోలీస్టేషన్ కు వచ్చారు. ఆమెను పోలీసులు ఆరు గంటలపాటు విచారించారు. హత్యకు ముందు,.. ఆ తర్వాత జరిగిన పరిణామాలపై అవంతి స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. తన మామకు ఇప్పటికీ బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, ఆడియో రికార్డులను పోలీసులకు అందజేసినట్లు అవంతి తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించి, తమకు న్యాయం చేయాలన్నారు.

తన భద్రత విషయంపై పోలీసులు భరోసాఇచ్చారని అవంతి తెలిపింది. నిందితులకు బెయిల్ రాకుండా చూస్తామని పోలీసులు చెప్పినట్లు ఆమె తెలిపారు. కేసుకు సంబంధించి పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చినట్లు ఆమె వెల్లడించారు.

Tags

Next Story