సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసిన హేమంత్ భార్య అవంతి

సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసిన హేమంత్ భార్య అవంతి
X

తనకు, తన అత్తమామలకు ప్రాణహాని ఉందని హేమంత్ భార్య అవంతి ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదే విషయంపై సైబరాబాద్ సీపీ సజ్జనార్‌ను కలిసి భద్రత కల్పించాలని కోరారు. హేమంత్ హత్యతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేయాలని అవంతి సీపీని కోరారు. మరోవైపు హేమంత్ హత్య కేసులో ప్రధాన నిందితులైన లక్ష్మారెడ్డి, యుగంధర్ రెడ్డిలను పోలీసులు ఆరు రోజులపాటు విచారించనున్నారు. ఈ మర్డర్ కేసులో ప్రధాన కుట్రదారు లక్ష్మారెడ్డి, ప్లాన్‌ను అమలు చేసింది యుగంధర్ రెడ్డి అని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 21 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. హేమంత్‌ హత్యకు పాల్పడిన సుపారీ గ్యాంగ్‌లో ఇంకా ఎవరి హస్తం ఉంది అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Tags

Next Story