తెలంగాణలో ప్రభుత్వ భూముల గుర్తింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు ..!

ప్రభుత్వ భూములు ఆక్రమణలు, అక్రమ అమ్మకాలు జరుగుతున్నట్లు తరచూ తమ దృష్టికి వస్తోందన్న హైకోర్టు ధర్మాసనం... రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించింది.

తెలంగాణలో ప్రభుత్వ భూముల గుర్తింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు ..!
X

తెలంగాణలో ప్రభుత్వ భూముల గుర్తింపుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ భూములు ఆక్రమణలు, అక్రమ అమ్మకాలు జరుగుతున్నట్లు తరచూ తమ దృష్టికి వస్తోందన్న హైకోర్టు ధర్మాసనం... రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేసి ప్రభుత్వ భూములను గుర్తించాలని ఆదేశించింది. 33 జిల్లాలో కలెక్టర్లు వెంటనే సర్వే పనులు చేపట్టి నిర్ణీత వ్యవధిలో పూర్తిచేయాలని తెలిపింది. ప్రభుత్వ భూములను గుర్తించి, జియో సర్వే వివరాలతో రికార్డుల్లో నమోదు చేయాలని సూచించింది. ప్రభుత్వ భూములు అక్రమ రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ భూముల వివరాలను రిజిస్ట్రేషన్‌ అధికారులకు పంపించి... రికార్డుల్లోకి రాని ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్‌ చేయవద్దని సబ్‌ రిజిస్ట్రార్లను జిల్లా కలెక్టర్లు ఆదేశించాలని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వ భూముల సర్వే, వివరాల నమోదును కలెక్టర్లు వ్యక్తిగతంగా పర్యవేక్షించాలని... 33 జిల్లాల కలెక్టర్లు వేర్వేరుగా నివేదికలు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

Next Story

RELATED STORIES