ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు

ధరణి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్లపై స్టే పొడిగింపు
ధరణి పోర్టల్‌ కు సంబంధించి దాఖలైన ఏడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేపట్టింది.

ధరణి పోర్టల్‌లో వ్యవసాయేతర ఆస్తుల నమోదు, రిజిస్ట్రేషన్లపై గతంలో ఇచ్చిన స్టేను జూన్ 21 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ధరణి పోర్టల్‌ కు సంబంధించి దాఖలైన ఏడు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు సీజే జస్టిస్‌ హిమా కోహ్లీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఒకే అంశంపై అనేక పిటిషన్లు అవసరం లేదన్న ధర్మాసనం.. అందులో ఐదు పిటిషన్లను తోసిపుచ్చి, రెండింటిని విచారణకు స్వీకరించింది.

ధరణిపై అభ్యంతరాలను మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోందని, ప్రభుత్వ వైఖరి తెలిపేందుకు సమయం కావాలని అడ్వొకేట్‌ జనరల్‌ ప్రసాద్‌ కోరారు. ఏజీ విజ్ఞప్తిపై స్పందించిన ధర్మాసనం గతంలో ఇచ్చిన స్టేను జూన్‌ 21 వరకు పొడిగిస్తూ విచారణ వాయిదా వేసింది.


Tags

Read MoreRead Less
Next Story