ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ నమోదుపై హైకోర్టు స్టే..

ధరణి పోర్టల్‌లో నాన్ అగ్రికల్చర్ ప్రాపర్టీ నమోదుపై హైకోర్టు స్టే..

ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుకు ఒత్తిడి చేయవద్దని ఆదేశిస్తూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. వ్యవసాయ ఆస్తుల నమోదులో ఆధార్‌ వివరాల కోసం ఒత్తిడి చేయవద్దనని స్పష్టం చేసింది. ఇప్పటివరకు సేకరించిన వివరాలను బయటి వ్యక్తులకు ఇవ్వొద్దని ఆదేశించింది. ఏ చట్టం ప్రకారం ఆధార్‌, కులం వివరాలు సేకరిస్తున్నారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. కొత్త రెవెన్యూ చట్టం వ్యవసాయ భూములకు సంబంధించింది మాత్రమేనని.. ఇందులో వ్యవసాయేతర భూముల ప్రస్తావన ఎక్కడుందని ప్రశ్నించింది. వ్యక్తిగత వివరాలకు భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించింది.

డేటా భద్రతకు సంబంధించి కొత్త రెవెన్యూ చట్టంలో ప్రస్తావనే లేదుని.. డేటా దుర్వినియోగమైతే ప్రజల వ్యక్తిగత గోప్యతకు తీవ్ర విఘాతం కల్గుతుందని హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. అటు.. డేటా భద్రతకు అన్ని చర్యలు తీసుకున్నట్లు హైకోర్టుకు ఏజీ తెలిపారు. కౌంటర్ దాఖలుకు రెండు వారాలు గడువు కోరారు. చట్టబద్ధత, డేటా భద్రతపై పూర్తి వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణన ఈనెల 20కి వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story