హైదరాబాద్‌లో కూలిన భవనం

X
By - Nagesh Swarna |11 Oct 2020 3:50 PM IST
హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఓ భవనం కుప్పకూలింది. హుస్సేనీ అలం పోలీస్టేషన్ పరిధిలో పాత రేకుల భవనం కూలిపోయింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. అయితే భవనం శిధిలాల కింద చిక్కుకొన్నవారిని రక్షించేందుకు చర్యలు చేపట్టారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీవర్షాల కారణంగా భవనం శిధిలమై కూలినట్లు తెలుస్తోంది. వెంటనే రంగంలోకి దిగిన డిఆర్ఎఫ్ అధికారులు శిధిలాలను తొలగిస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com