Huzurabad Congress Candidate: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..

Huzurabad Congress Candidate: హుజూరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఖరారు..
Huzurabad Congress Candidate: హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది.

Huzurabad Congress Candidate: హుజురాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థిపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఉపఎన్నికల్లో అభ్యర్థిగా ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్‌ను కాంగ్రెస్ బరిలో దింపింది. పలువురు పేర్లను పరిశీలించిన కాంగ్రెస్ అధిష్టానం బలమూరు వెంకట్ పేరును ఫైనల్ చేసింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ నుంచి గెల్లు శ్రీనివాస్ బరిలో ఉండగా బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ పోటీ చేయనున్నారు.

అటు ప్రచారంలోనూ బీజేపీ, టీఆర్‌ఎస్‌లు దూసుకపోతున్న తరుణంలో... అభ్యర్థి ప్రకటనతో కాంగ్రెస్ కూడా సత్తాచాటేందుకు సమయత్తమవుతోంది. ఇప్పటి వరకూ కొండా సురేఖ హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారని ఆ పార్టీ శ్రేణులు భావించాయి. అయితే అకస్మాత్తుగా బలమూరు వెంకట్‌ పేరు తెరపైకి వచ్చింది. దీంతో హుజూరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది తెలిపోయింది.

టీఆర్‌ఎస్‌ తరఫున ఆ పార్టీ విద్యార్థి నాయకుడిని అభ్యర్థిగా నిలబెడుతున్న నేపథ్యంలో... బల్మూరు వెంకట్‌ పేరును కాంగ్రెస్‌ ముఖ్యులు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. నామినేషన్లకు మరో ఐదు రోజులే గడువు ఉండటంతో ఇంకా ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ తన అభ్యర్థిని ప్రకటించింది.

అభ్యర్థి ఎంపికపై శుక్రవారం జరిగిన చర్చలో పలువురి పేర్లు పరిశీలనకు వచ్చాయి. వెంకట్‌ పేరును ప్రతిపాదించే ముందు పార్టీ ముఖ్యనేతలు.. ఆయన్ని పిలిచి అభిప్రాయం తీసుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌, సీఎల్పీ నేత భట్టి, ప్రచార కమిటీ చైర్మన్‌ దామోదర్‌ రాజనర్సింహ తదితరులతో చర్చించిన అనంతరం వెంకట్ పేరును ఖరారు చేసినట్లు సమాచారం.

Tags

Read MoreRead Less
Next Story