Huzurabad By Election: రేపే హుజురాబాద్ ఉప ఎన్నికలు.. పోరులో నెగ్గేదెవరు? తగ్గేదెవరు?

Huzurabad By Election: రేపే హుజురాబాద్ ఉప ఎన్నికలు.. పోరులో నెగ్గేదెవరు? తగ్గేదెవరు?
Huzurabad By Election: ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్‌ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది.

Huzurabad By Election: ఉత్కంఠ రేపుతున్న హుజురాబాద్‌ పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. దాదాపు ఐదు నెలల పాటు రాజకీయ పార్టీలు ముమ్మర ప్రచారం చేయగా.. ఓటర్‌ తన నిర్ణయాన్ని ప్రకటించే సమయం వచ్చింది. ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్‌ జరగనుంది.. దీని కోసం హుజూరాబాద్ నియోజకవర్గంలో 306 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు.

నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 2లక్షల 37వేల 36 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు లక్షా 17వేల 933 మంది కాగా, స్త్రీలు 1లక్షా 19వేల 102 ఉన్నారు. పోలింగ్‌కు ఇప్పటికే అధికారులు భారీ ఏర్పాటు చేశారు. హుజురాబాద్ బైపోల్‌ను కొవిడ్ నిబంధనల ప్రకారం నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్‌ తెలిపారు. నియోజకవర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని చెప్పారు.

ఉప ఎన్నిక కోసం మొత్తం 421 కంట్రోల్ యూనిట్లు, 891 బ్యాలెట్ యూనిట్లు, 515 వివి ప్యాడ్‌లను వినియోగిస్తున్నారు. 1715 మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గోనున్నారు. శుక్రవారం సాయంత్రానికే పోలింగ్‌ సామగ్రితో సిబ్బంది.. తమకు కేటాయించిన పోలింగ్‌ కేంద్రాలకు చేరుకున్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌లు ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు చేరాయి.. అలాగే పోలింగ్ స్టేషన్లలో లైవ్ వెబ్ కాస్టింగ్ నిర్వహిస్తున్నామని అధికారులు స్పష్టం చేశారు.

పోలింగ్ కేంద్రాల్లో ప్రవేశానికి ముందు ప్రతి ఓటరు శానిటైజ్‌ చేసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో హెల్త్ వర్కర్ థర్మా మీటర్‌తో టెంపరేచర్‌ను పరీక్షించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. దీనితో పాటు ఓటర్లు ఈవీఎం బ్యాలెట్ యూనిట్ బటన్ ప్రెస్ చేసేందుకు కుడిచేతికి గ్లౌజులు సిద్ధం చేశారు.

ఓటు హక్కు వినియోగించుకునే కొవిడ్ రోగులకు పీపీఈ కిట్లను కూడా సమకూరుస్తున్నారు. నియోజకవర్గంలో 172 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను, 63 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు. ఇక ప్రజలు శాంతియుత వాతావరణంలో స్వేచ్చగా తమ ఓటు హక్కును వినియోగించుకొనేందుకు 3వేల 865 మందితో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి ప్రత్యేక బలగాలను మోహరించినట్లు వెల్లడించారు.

ఎన్నికల ఫిర్యాదులకు సీ-విజిల్‌ యాప్‌ను వినియోగించాలని అధికారులు కోరుతున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్‌ యాప్‌ ద్వారా అభ్యర్థులు చేసే అక్రమాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను స్మార్ట్‌ ఫోన్‌లో తీసి యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తే.. వెంటనే అవి జిల్లా ఎన్నికల అధికారికి చేరుతాయని పేర్కొన్నారు. వచ్చిన ఫిర్యాదులపై వెంటనే పరిశీలించి, వాస్తవాలుంటే వంద నిమిషాల్లో సంబంధిత అభ్యర్థిపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇక ఫోటోలు, వీడియోలు పంపిన వ్యక్తుల వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక డబ్బులు అడిగిన ఓటర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఈవో శశాంక్ గోయల్ హెచ్చరించారు.. తమకు డబ్బులు రాలేదని నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాలో కొంతమంది ఆందోళన చేయడం ఈసీ దృష్టికి వచ్చిందన్నారు. ఓటు కోసం డబ్బులు అడిగిన వారిని గుర్తిస్తున్నామని చెప్పారు. డబ్బులు అడిగినట్లు తేలితే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story