Hyderabad : బాలకృష్ణకు నా భర్త పెద్ద ఫ్యాన్‌ : తమిళిసై

Hyderabad : బాలకృష్ణకు నా భర్త పెద్ద ఫ్యాన్‌ : తమిళిసై
హైదరాబాద్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రేఖ రాజశేఖర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డే కేర్‌ రెండో యూనిట్‌ను.. బాలకృష్ణతో కలిసి గవర్నర్‌ ప్రారంభించారు

బాలకృష్ణకు తన భర్త పెద్ద ఫ్యాన్‌ అని అన్నారు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై. హైదరాబాద్‌ బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రిలో రేఖ రాజశేఖర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో డే కేర్‌ రెండో యూనిట్‌ను.. బాలకృష్ణతో కలిసి గవర్నర్‌ ప్రారంభించారు. ఎంతో మంది పేదలకు ఇక్కడ వైద్యం అందిస్తున్నారని కొనియాడారు. క్యాన్సర్‌ బారిన పడ్డ వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఒక డాక్టర్‌గా తనకు తెలుసని తమిళిసై అన్నారు. ప్రస్తుతం క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని.. దీనిపై అందరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తాను డాక్టర్‌గా పిల్లల్ని ఎలా హ్యాండిల్‌ చేస్తానో.. కొత్తగా ఏర్పడిన ఈ రాష్ట్రాన్ని అలాగే చూస్తున్నానని పేర్కొన్నారు. అడ్వాన్డ్స్‌ టెక్నాలజీ ద్వారా బసవతారకం ఆస్పత్రిలో క్యాన్సర్‌ చికిత్స అందిస్తున్నామని నందమూరి బాలకృష్ణ తెలిపారు. ఎంతోమంది ఇచ్చిన డొనేషన్ల వల్ల ఎంతో మంది పేదలకు వైద్యం అందిస్తున్నామని చెప్పారు. గవర్నర్‌ చేతుల మీదుగా డే కేర్‌ యూనిట్‌ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు.

Tags

Read MoreRead Less
Next Story