Hyderabad: రూ.295 కోట్లు విలువైన మత్తుపదార్ధాల ధ్వంసం

Hyderabad: రూ.295 కోట్లు విలువైన మత్తుపదార్ధాల ధ్వంసం
భారీస్థాయిలో మత్తుపదార్థాలు ధ్వంసం చేసిన హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా నివారణ దినోత్సవం రోజున హైదరాబాద్ పోలీసులు భారీ స్థాయిలో మత్తుపదార్థాలు ధ్వంసం చేశారు. 'సే నో టు డ్రగ్స్' ప్రచారంలో భాగంగా సుమారుగా 8,946.263 కేజీల వివిధ రకాల మాదక ద్రవ్యాల్ని ధ్వంసం చేశారు. వీటి విలువ సుమారుగా రూ.295 కోట్లు ఉంటుందని అధికారులు తెలిపారు.


కేంద్ర ప్రభుత్వ 'నషా ముక్త్ పక్వాడా'లో భాగంగా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, హైదరాబాద్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు వివిధ సందర్భాల్లో వీటిని పట్టుకున్నారు. అందులో 77 కోట్ల విలువైన 11 కేజీల హెరాయిన్‌ని మలాయ్, టాంజానియా, అంగోలా దేశస్థులు అక్రమంగా తీసుకువస్తుండగా రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు. మేడ్చల్ జిల్లాలోని దుండిగల్‌లో ఉన్న హైదరాబాద్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌ ప్రాజెక్టులో ఈ మాదకద్రవ్యాల్ని నాశనం చేశారు.

అత్యధికంగా 2655.942 కేజీల గంజాయి, 11 కేజీల హెరాయిన్, 409.39 కేజీల ఆల్ప్రాజోలం, 142.932 కేజీల ఎఫిడ్రిన్ హైడ్రోక్లోరైడ్, 74.92 కేజీల కెటమైన్ హైడ్రోక్లోరైడ్, 2.956 కేజీల మెఫిడ్రోన్, 53.983 కేజీల మెథాక్వాలోన్, ఎఫిడ్రిన్ తయారీకి ఉపయోగించే 5595.14 కేజీల ఇతర రసాయనాలను ధ్వంసం చేశారు.

దేశవ్యాప్తంగా సుమారు 11 కోట్ల మంది మత్తు పదార్థాలకు బానిస అయినట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు.






Tags

Read MoreRead Less
Next Story