నెల రోజుల ముందే హేమంత్‌ హత్యకు ప్లాన్‌

నెల రోజుల ముందే హేమంత్‌ హత్యకు ప్లాన్‌

హైదరాబాద్‌లో హత్యకు గురైన హేమంత్‌ కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో పోలీసులు సంచలన విషయాలు వెల్లడించారు. నెల రోజుల ముందే అవంతి తండ్రి, బంధువులు... హేమంత్‌ హత్యకు ప్లాన్‌ చేసినట్టు తెలిపారు. హేమంత్‌ హత్యకు స్కెచ్‌ వేసిన అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, మామ యుగంధర్‌ పథకం వేసినట్టు పేర్కొన్నారు. కిరాయి హంతకులు కృష్ణ, రాజు, పాషాతో హత్యకు కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నారని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న హేమంత్‌ ఇంట్లోకి అవంతి బంధువులు 12 మంది చొరబడ్డారు. ఇద్దరిపైనా దాడి చేస్తూ... కారులో ఎక్కించి తీసుకెళ్లారు. గోపన్‌పల్లిలో అవంతి, హేమంత్‌ ఇద్దరూ తప్పించుకున్నారు. ఈ క్రమంలో అవంతి పారిపోగా... హేమంత్‌ దొరికిపోయాడు. అతడిని తీసుకెళ్లి హత్య చేశారు.

మరోవైపు... జూన్‌ 10న అవంతిరెడ్డి ఇంట్లో నుంచి వెళ్లిపోయి... జూన్‌ 11న హేమంత్‌ను పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచి అవంతి తల్లిదండ్రులు లక్ష్మారెడ్డి, అర్చన ఆగ్రహంతో ఉన్నారు. నాలుగు నెలలపాటు ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో సోదరుడు యుగంధర్‌తో అర్చన అవంతి పెళ్లి గురించి ఆవేదన వ్యక్తంచేశారు. అనంతరం... యుగంధర్‌, లక్ష్మారెడ్డి హేమంత్‌ హత్యకు ప్లాన్‌ చేశారు. ఈ నెల 24న కిడ్నాప్‌ చేసి... హత్య చేశారు.

హేమంత్‌ హత్యపై అతడి సోదరుడు సుమంత్‌ ఆవేదన వ్యక్తంచేశాడు. లక్ష్మారెడ్డికి డబ్బు ఎక్కువ ఉండటం వల్లే తన అన్నను చంపారని మండిపడ్డారు. తన అన్న చావుకు కారణమైన 12 మందిని తన ఎదురుగా కూర్చోబెట్టాలని ఆగ్రహం వ్యక్తంచేశాడు. రేపటి నుంచి పోలీస్‌ స్టేషన్‌ ముందు కూర్చుంటానని అన్నారు. పెళ్లయిన తర్వాత కాంప్రమైజ్‌ అని చెప్పి చంపారని అన్నారు. డబ్బులు ఎరవేసినా... లక్ష్మారెడ్డికి పోలీసులు లొంగకుండా బుద్ధి చెప్పారని తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story