Hyderabad: సైబర్‌ నేరగాళ్లకు చెక్‌.. రూ.కోటి 40లక్షల నగదును స్వాధీనం

Hyderabad: సైబర్‌ నేరగాళ్లకు చెక్‌.. రూ.కోటి 40లక్షల నగదును స్వాధీనం
రెండు సైబర్‌ క్రైమ్‌ కేసులను ఛేదించిన హైదరాబాద్‌ పోలీసులు

సైబర్ క్రైమ్ విభాగం 2 కీలకమైన కేసులను చేధించినట్లుగా హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ తెలిపారు. ఆన్‌లైన్‌ గేమింగ్‌ల పేరుతో ఒకరు మోసాలకు పాల్పడగా...... యూనిటీ స్టాక్స్‌ పేరుతో మరో వ్యక్తి మోసం చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు చాకచక్యంగా రెండుకేసులను ఛేదించగలిగారు. నిందితుల బ్యాంకు ఖాతాలను నిలిపివేసినట్లు వెల్లడించారు.

హర్యానాకు చెందిన హితేష్ గోయల్ సీఏ పూర్తిచేశాడు. బ్యాంకుల లొసుగులు, వ్యాపార లావాదేవీలో మోసాలు, చట్టానికి చిక్కకుండా తప్పించుకునే మార్గాలపై పట్టు సాధించాడు.అదే ధీమాతో దుబాయ్ లోని మిత్రుడు సంజీవ్ సహాయంతో ఆన్లైన్ గేమింగ్ మోసాలకు తెరలేపాడు. ఫిలిప్పైన్స్, దుబాయ్, హాంకాంగ్, చైనా ఇతరదేశాలల్లో ఆన్లైన్ పందేలు నిర్వహించాడు. డఫాబెట్ డాట్‌కామ్ నిర్వాహకులతో వారిద్దరు చేతులు కలిపారు. అవసరమయ్యే బ్యాంకు ఖాతాలు, మర్చంట్ ఐడీలు విదేశీయులకు అందించి సహకరిస్తున్నారు. నాలుగేళ్లుగా ఢిల్లీలోని కార్యాలయం నుంచే మాయలగారడీతో వందలాది మందిని ప్రజలను మెసాలు చేసినట్లు పోలీసులు గుర్తించారు.. దేశవ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లలో అతడిపై సుమారు 100కు పైగా కేసులు నమోదైతే హైదరాబాద్లో 11 ఉన్నాయని సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ తెలిపారు. నిందితుడి నుంచి కోటి 40లక్షల నగదు, 28 మొబైల్‌ ఫోన్లు, 3 హార్డ్ డిస్క్‌లు, 2 ల్యాప్‌టాప్‌లు, 36 బ్యాంకు చెక్ బుక్స్, 52 హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.

నాగపూర్ చెందిన రోనక్ తన్నా గోవాలో నివస్తున్నాడు. అక్కడ మోసగాళ్లతో చేతులు కలిపి దళారిగా అవతారమెత్తాడు. విదేశాల నుంచి సైబర్ నేరాలకు పాల్పడే ముఠాలకు సహకరించేందుకు దుబాయ్‌కి చెందిన వారివద్ద ఒప్పందం కుదుర్చుకున్నాడు. సైబర్ మోసాల్లో నగదు లావాదేవీలకు అవసరమైనబ్యాంకు ఖాతాలను సమకూర్చటం ప్రారంభించాడు. దేశవ్యాప్తంగా ఉన్న పరిచయాలతో వివిధ నగరాల్లో ఏజెంట్లను నియమించుకున్నాడు. వారి సహకారంతో ఆ ఖాతాల ద్వారా దేశవ్యాప్తంగా ఎంతో మంది అమాయకుల నుంచి నగదుకాజేశారని దర్యాప్తులో తేలిందని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కోత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు... వారిపై ఇప్పటి వరకూ 83 కేసులు నమోదైనట్టు గుర్తించామన్నారు. నిందితుడి వద్ద నుంచి 2 ల్యాప్‌టాప్‌లు, 6 మొబైల్‌ఫోన్లు, 6 చెక్ బుక్స్, 6 సిమ్‌కార్డులు, 15 డెబిట్‌ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

కేసులను ఛేదించిన సైబర్ క్రైమ్ పోలీసుల బృందాన్ని CP అభినందించారు. సామాజిక మాధ్యమాల ద్వారా వచ్చే ప్రకటనలు, లింకులను నమ్మి మోసపోవద్దని ఆయన ప్రజలకు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story