తెలంగాణ

హైదరాబాద్‌ SBI ఏటీఎంలో చోరీ

హైదారాబాద్‌ వనస్థలిపురంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు..

హైదరాబాద్‌ SBI ఏటీఎంలో చోరీ
X

హైదారాబాద్‌ వనస్థలిపురంలో ఉన్న ఎస్‌బీఐ ఏటీఎంలో భారీ చోరీ జరిగింది. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. మొత్తం 5 మంది ముఠా సభ్యులు... కారులో వచ్చి చోరీ చేశారు. దుండగుల్లో ఒకరు ఏటీఎంలోకి గ్యాస్ కటర్‌తో వెళ్లినట్లు సీసీ దృశ్యాల్లో రికార్డు అయ్యాయి.

6 పోలీసు టీంలు దొంగల కోసం గాలిస్తున్నాయి. దుండగులు ఏటీఎం నుంచి ఎంత మొత్తం దోచుకెళ్లారనేది తెలియాల్సి ఉంది. 4 ఏళ్ల క్రిందట ఇదే ఏటీఎంలో చోరీ జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఏటీఎంలో అలారం లేకపోవడంతో రెండో సారి కూడా చోరి జరిగినట్లు భావిస్తున్నారు. పాత నేరస్థులపైనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు.

Next Story

RELATED STORIES